గిట్టుబాటు ధర కోసం రైతు పరుగుయాత్ర

15 Apr, 2018 01:01 IST|Sakshi

మద్దతు తెలిపిన జస్టిస్‌ చంద్రకుమార్‌

హైదరాబాద్‌: పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతు ఆత్మహత్యలను అరికట్టాలని కోరుతూ ఓ రైతుబిడ్డ చేపట్టిన రైతు పరుగుయాత్ర శనివారం ప్రారంభమైంది. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్లో కనువిప్పు కలగాలని ఫణి అనే యువకుడు హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ నుంచి అమరావతిలోని ఏపీ అసెంబ్లీ వరకు ఈ యాత్ర చేపట్టాడు. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్‌ చంద్రకుమార్‌ వనస్థలిపురం దగ్గర ఫణికి స్వాగతం పలికి మద్దతు ప్రకటించారు.

జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ రైతులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా ఇవ్వడంలేదని, అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేవిధంగా ఫణి రైతు పరుగుయాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఎస్పీ మీనయ్య, తెలంగాణ ప్రజల పార్టీ యువజన విభాగం నాయకులు కోట్ల వాసు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు