విజేతలు వీరే | Sakshi
Sakshi News home page

విజేతలు వీరే

Published Thu, Sep 14 2017 11:00 AM

వివరాలను ప్రకటిస్తున్న సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ కె.రామచంద్రమూర్తి, సిటీ బ్యూరో చీఫ్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌(ఏడీ

‘సాక్షి’ జలం–జనం, సెల్ఫీ విత్‌ గణేశ్‌ విజేతలు వీరే
నేడు విజేతలకు బహుమతుల ప్రదానం


సాక్షి, సిటీబ్యూరో : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ‘సాక్షి’ మీడియా గ్రూప్, ఆలివ్‌ మిఠాయి సంయుక్తంగా నిర్వహించిన ‘జలం–జనం’ కార్యక్రమానికి నగర ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది.  తమ ఇళ్లు, నివాసాల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించి వాననీటి పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. నగరవాసులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. పర్యావరణ పరిరక్షణకు తాము సైతం... అంటూ పోటీకి నిలిచారు.

ఈ  పోటీలో  పాల్గొన్న వారి  ఎంట్రీల నుంచి విజేతల ఎంపికకు బుధవారం బంజారాహిల్స్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో  నిర్వహించిన  లక్కీ డ్రా కార్యక్రమానికి సాక్షి ఎడిటోరియల్‌ డైరెక్టర్‌  కె.రామచంద్రమూర్తి ముఖ్య అతిథిగా హాజరై  డ్రా తీసి విజేతల వివరాలను ప్రకటించారు. జలం–జనం కార్యక్రమంలో  మొత్తం 10మంది విజేతలుగా నిలిచారు. మొదటి ముగ్గురికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించగా, మిగతా ఏడుగురికి  కన్సొలేషన్‌ బహుమతులు అందజేయనున్నారు. మొదటి ముగ్గురికి బంగారం బహుమతులుగా అందజేయనున్నారు.  

సెల్ఫీ విత్‌ గణేశ్‌..
పర్యావరణ పరిరక్షణలో  భాగంగా ఈ ఏడాది గణపతి మట్టి విగ్రహాల ఏర్పాటుపై ‘సాక్షి’ ఇచ్చిన పిలుపునకు నగరం నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా అనేక మంది తమ ఇళ్లల్లో  మట్టి వినాయక ప్రతిమలలను చాటుకొని భగవంతుడి పట్ల భక్తిని, పర్యావరణ పరిరక్షణ పట్ల అంకితభావాన్ని చాటుకున్నారు.మట్టి విగ్రహాల ఏర్పాటుపై సాక్షి మీడియూ గ్రూపు, ఆలివ్‌ మిఠాయీ సంయుక్త ఆధ్వర్యంలో ‘సెల్ఫీ విత్‌ గణేశ’ పోటీలను నిర్వహించింది.ఈ పోటీలకు వచ్చిన ఎంట్రీల నుంచి  డ్రా తీసి  10 మంది  విజేతలను ఎంపిక చేశారు. ఈ రెండు కేటగిరీలలో గెలుపొందిన విజేతలకు గురువారం బంజారాహిల్స్, రోడ్డు నెంబర్‌–1లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో నిర్వహించే కార్యక్రమంలో బహుమతులను అందజేయనున్నారు. 
రెండు కేటగిరీలలో బహుమతులను గెలుపొందిన  విజేతల వివరాలు, ఎంట్రీ నెంబరు:

 

Advertisement

తప్పక చదవండి

Advertisement