సాక్షి టీవీ జర్నలిస్టు ‘జెస్సీ’ కన్నుమూత | Sakshi
Sakshi News home page

సాక్షి టీవీ జర్నలిస్టు ‘జెస్సీ’ కన్నుమూత

Published Mon, Dec 19 2016 3:09 AM

సాక్షి టీవీ జర్నలిస్టు ‘జెస్సీ’ కన్నుమూత - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ స్పోర్ట్స్‌ జర్నలిస్ట్, సాక్షి టీవీ స్పెషల్‌ కరస్పాండెంట్‌ జె.శ్రీనివాసులు (55) తీవ్ర గుండెపోటుతో ఆదివారం తెల్ల వారుజామున మృతి చెందారు. మూడు దశా బ్దాలుగా క్రీడా పాత్రికేయునిగా తెలుగు మీడియాలో ప్రత్యే క గుర్తింపు దక్కించుకున్న శ్రీనివాసులుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ దాదాపు 30 ఏళ్ల క్రితం ఉదయం దినపత్రికలో క్రీSడా పాత్రికేయుడిగా కెరీర్‌ ప్రారంభించారు. తర్వాత వార్త దినపత్రిక స్పోర్ట్స్‌ ఎడిటర్‌గా చేశారు. 2008 నుంచి సాక్షి టెలివిజన్‌ చానల్‌లో పని చేస్తున్నారు. పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లను ఆయన ప్రత్యక్షంగా కవర్‌ చేశారు. రేడియో, టీవీ వ్యాఖ్యాతగా కూడా పని చేశారు. సన్నిహి తులు ఆత్మీయంగా ‘జెస్సీ’ అని పిలుచుకునే ఆయన అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి.

సీఎం కేసీఆర్, వైఎస్‌ జగన్,వైఎస్‌ భారతి దిగ్భ్రాంతి
జెస్సీ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్ర సంతాపం ప్రకటించారు. సీఎం తరఫున ఆయన పీఆర్వో జి.విజయకుమార్‌ జెస్సీ మృతదేహంపై పుష్పగుచ్ఛముంచి నివాళులర్పించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ‘సాక్షి’ చైర్‌పర్సన్‌ వైఎస్‌ భారతి జెస్సీ హఠాన్మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జెస్సీ కుటుంబసభ్యులను వైఎస్‌ జగన్‌ ఫోన్‌లో పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పాత్రికేయలోకానికి తీరని లోటని భారతి అన్నారు. ‘సాక్షి’ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ రామచంద్రమూర్తి, ఎడిటర్‌ వి.మురళి, ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ తదితరులు జెస్సీ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. క్రీడా మంత్రి పద్మారావు, స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వరరెడ్డితో పాటు పలు క్రీడా సంఘాలు జెస్సీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశాయి

Advertisement

తప్పక చదవండి

Advertisement