వారంలోగా ఇసుక క్వారీలను గుర్తించాలి | Sakshi
Sakshi News home page

వారంలోగా ఇసుక క్వారీలను గుర్తించాలి

Published Wed, Dec 24 2014 3:12 AM

వారంలోగా ఇసుక క్వారీలను గుర్తించాలి - Sakshi

సాక్షి, హైదరాబాద్: వారం రోజుల్లోగా అన్ని జిల్లాల్లో ఇసుక క్వారీలను గుర్తించాలని గనులు, భూగర్భ ఖనిజ వనరుల శాఖ మం త్రి హరీశ్‌రావు అధికా రులను ఆదేశించారు. మంగళవారం గనులు, భూగర్భ శాఖ ప్రధాన కార్యాలయంలో అన్ని జిల్లాల అసిస్టెంట్ డెరైక్టర్లతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ భూగర్భ జల మట్టం ప్రమాదస్థాయిలో ఉన్న ప్రాంతాలున్నందున.. భూగర్భ జల శాఖ అధికారుల సహకారంతో మైనింగ్ విభాగం ఈ క్వారీలను గుర్తించాలని మంత్రి సూచిం చారు. జిల్లాల వారీగా ఆ వివరాలను తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు అందించాలని సూచించారు.
 
 దీంతోపాటు కొత్త పాలసీ ప్రకారం ఇసుక అమ్మకాలకు వీలుగా ఇసుక డంప్ యార్డులను నెలకొల్పాల్సి ఉం ద ని.. పట్టణాలు, నగరాల శివార్లలో డంప్ యార్డులకు అనువైనస్థలాలను గుర్తించాలని ఆదేశిం చారు. వారం రోజుల్లోగా ఈ జాబితాలు అం దజేయాలన్నారు. ఈలోగా ఇసుకధరను ప్రభుత్వం నిర్ణయిస్తుందని ప్రకటించారు. ఇసుక విక్రయాలన్నీ ఆన్‌లైన్ విధానంలో జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గిరిజన ప్రాంతాల్లో క్వారీలను గిరిజన సొసైటీలకు అప్పగిస్తామని చెప్పారు.
 
 అంధులకు రెసిడెన్షియల్ స్కూళ్లు
 అన్ని జిల్లాల్లో అంధుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ప్రకటించారు.  బ్రెయిలీ క్యాలెండర్‌ను మంగళవారం తెలంగాణభవన్‌లో మంత్రి ఆవిష్కరించారు. అంధులు  ఆంగ్ల విద్యాభ్యాసం చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని హరీశ్ తెలిపారు.  
 

Advertisement
Advertisement