రాంరెడ్డి వెంకటరెడ్డి మృతి పట్ల ప్రముఖుల సంతాపం

4 Mar, 2016 19:30 IST|Sakshi

హైదరాబాద్ : ప్రజా పద్దుల సంఘం చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాంరెడ్డి వెంకట రెడ్డి మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ప్రతిపక్షనాయకులు కె.జానా రెడ్డి, కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్ రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.

ఎంపీ గుత్తా సుఖేందర్‌దర్ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, భాస్కర్‌రావు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్లు కూడా తమ సంతాపాన్ని వ్యక్తపరిచారు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, సౌమ్యునిగా పేరున్న వెంకట రెడ్డి మృతి పార్టీకి, ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్షం నాయకుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వేర్వేరు ప్రకటనల్లో సంతాపాన్ని తెలిపారు. వెంకట రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కాగా గత నాలుగేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రాంరెడ్డి వెంకట రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపికైన ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి, కిరణ్కుమార్ రెడ్డిల హయాంలో మంత్రిగా పనిచేశారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా