మైనర్ల డ్రైవింగ్పై స్పెషల్‌ డ్రైవ్‌ | Sakshi
Sakshi News home page

మైనర్ల డ్రైవింగ్పై స్పెషల్‌ డ్రైవ్‌

Published Wed, Jul 13 2016 10:48 PM

Special drive to minors driving on the roads

హైదరాబాద్: మైనర్ల డ్రైవింగ్ పై వెస్ట్‌జోన్ ట్రాఫిక్ పోలీసులు దృష్టిసారించారు. బుధవారం సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 101 మంది మైనర్లు డ్రైవ్ చేస్తుండగా పట్టుబడ్డారు. ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 33 మంది, బేగంపేట్ పరిధిలో 40, పంజగుట్టలో 13, బంజారాహిల్స్‌లో 7, జూబ్లీహిల్స్‌లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అమీర్‌పేట్ మైత్రీవనం, సత్యం థియేటర్, ప్యారడైజ్, అమీర్‌పేట్, ఎంజే కాలేజ్, కేబీఆర్ పార్కు, జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్-45, బంజారాహిల్స్ రోడ్డునెంబర్-12లోని వీఎల్‌సీసీ వద్ద ఆయా పోలీస్‌స్టేషన్ల సిబ్బంది స్పెషల్ డ్రైవ్ జరిపారు.

వాహనాలను సీజ్ చేసి చలాన్లను విధించారు. వారి తల్లిదండ్రులతో వారికి మూడు రోజుల పాటు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్లు ట్రాఫిక్ ఏసీపీ మసూం బాషా తెలిపారు. గురువారం నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు మైనర్లచే వాహనాలు నడిపించవద్దని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్ముందు ఈ స్పెషల్ డ్రై వ్ కొనసాగుతుందన్నారు.

Advertisement
Advertisement