జర్మనీకి దూసుకెళ్లిన సాహితీ ‘కిరణం’ | Sakshi
Sakshi News home page

జర్మనీకి దూసుకెళ్లిన సాహితీ ‘కిరణం’

Published Fri, Aug 16 2013 1:25 AM

Squeaked through the literary invention

సాక్షి, సిటీబ్యూరో: కష్టాలున్నాయని కుంగిపోలేదు. అడుగడుగునా పేదరికం అడ్డుతగులుతున్నా అధిగమించాడు. సంకల్ప బలంతో ముందుకు సాగాడు చీకటిని చీల్చుకుంటూ దూసుకొచ్చే భానుడి కిరణంలా! మారుమూల పల్లెలో ఓ విద్యా కుసుమం వికసించింది. పరిమళించి పరవశించింది. పేరు గొల్ల కిరణ్‌కుమార్. ఊరు నల్లగొండ జిల్లా జాజిరెడ్డిగూడెం.

నగరంలోని ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ(ఇఫ్లూ)లో ‘సాంగ్స్ ఆఫ్ టియర్స్ అండ్ ద ఫోర్సెస్ ఆఫ్ వాయిస్- ద కంపేరిటీవ్ స్టడీ ఆఫ్ గద్దర్ అండ్ గోరటి వెంకన్న’ అనే అంశంపై ఎంఫిల్ పూర్తి చేశారు. పల్లెపాటల తియ్యదనాన్ని, శ్రమజీవుల సాహిత్య సౌందర్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. ‘కల్చర్స్ ఆఫ్ మెమొరీ-స్టడీ ఆఫ్ సాంగ్స్ కల్చర్స్ ఇన్ ఇండియా’ అనే అంశంపై ఇఫ్లూలో పీహెచ్‌డీ చేస్తున్నారు. జర్మనీలోని ప్రతిష్టాత్మక  టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్బెన్‌లో ఆరు నెలల పాటు అధ్యయనం చేసేందుకు ఆహ్వానం అందుకున్నారు.

ఈ యూనివర్సిటీ నుంచి ఆహ్వానం అందుకున్న ఏకైక ఇఫ్లూ విద్యార్థి కిరణ్‌కుమార్ కావడం విశేషం. ఉన్నత చదువుల కోసం, ఇఫ్లూ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమయ్యే గ్రామీణ విద్యార్థులకు చేయూతనందించాలన్న సంకల్పంతో తన సహచరి పద్మతో కలిసి ‘ప్రాక్టికల్ అప్రోచ్ టూ ఇంగ్లిష్ లిటరేచర్’ అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకం పలువురు మేధావుల ప్రశంసలు అందుకుంది. మారుమూల మల్లె అయినజాజిరెడ్డిగూడెం నుంచి ఖండాంతరాల్లోని జర్మనీకి దూసుకెళ్లిన కిరణ్‌కుమార్ గ్రామీణ పేద విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
 

Advertisement
Advertisement