Sakshi News home page

ముగ్గురికి సీఎం సర్వోన్నత పతకాలు

Published Fri, Jun 2 2017 3:42 AM

State police medals declared the government

రాష్ట్ర పోలీసు పతకాలు ప్రకటించిన ప్రభుత్వం
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీసు శాఖతో పాటు అగ్నిమాపక శాఖ, విజిలెన్స్, ఎస్పీఎఫ్‌ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. అత్యున్నతమైన ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకంతో పాటు మరో ఐదు విభాగాల్లో పతకాలను హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేదీ ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శౌర్య పతకం పొందిన వారు... 
 
పోలీస్‌ శాఖలోని గ్రేహౌండ్స్‌లో పనిచేస్తున్న డిప్యూటీ అసాల్డ్‌ కమాండర్‌ విద్యాసాగర్, జూనియర్‌ కమాండర్‌ బి.వెంకన్న, వై.సత్యనారాయణ, సీనియర్‌ కమాండర్‌ ఎస్‌.నర్సింహారావు, ఇంటెలిజెన్స్‌లోని కౌంటర్‌ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌ బి.బాలరాజు, ఎస్సైలు వెంకటేశ్వర్‌గౌడ్, సీహెచ్‌.సుదర్శన్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ కె.మధుసూదన్‌రావు, యూసుఫ్, మారుతీరావు, సాబుద్దీన్, భుజంగరావు, కానిస్టేబుళ్లు సయీద్‌ బిన్‌ ముఫ్తా, రామచంద్రారెడ్డి, లక్ష్మణ్‌రావు, జంగయ్య, సాదిక్‌ అహ్మద్, కేసీ విజయ్‌కుమార్‌. కాగా, ముగ్గురికి రాష్ట్ర మహోన్నత సేవా పతకం, 38 మంది సిబ్బందికి పోలీసు ఉత్తమ సేవా పతకం, 31 మందికి కఠిన సేవా పతకం, 163 మంది పోలీసు సిబ్బందికి పోలీసు సేవా పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.

అలాగే ఎస్పీఎఫ్‌లో ఎస్‌కే మహబూబ్‌బాషాకు మహోన్నత సేవా పతకం, 15 మంది సిబ్బందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించారు. అగ్నిమాపక శాఖలో లీడింగ్‌ ఫైర్‌మన్‌ నాగేశ్వర్‌రావుకు శౌర్య పతకం ప్రకటించగా, ఇద్దరికి ఉత్తమ సేవా పతకం, 14 మందికి సేవాపతకాలను ప్రకటించింది. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ముగ్గురికి ఉత్తమ సేవాపతకాలు, ఏడుగురికి సేవా పతకాలు ప్రకటించారు. ఏసీబీలో డీఎస్పీ సుదర్శన్‌కు మహోన్నత సేవా పతకం, మరో ఇద్దరికి ఉత్తమ సేవా పతకం ప్రకటించారు. అలాగే 12 మంది సిబ్బందికి పోలీసు సేవా పతకాలు ప్రకటించారు.  

ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీసు పతకం
ఎన్‌.మల్లారెడ్డి, ఏసీబీ డిప్యూటీ డైరెక్టర్‌
పి.రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీ, ఇంటెలిజెన్స్‌
పి.జగదీశ్వర్, ఇన్‌స్పెక్టర్, మైలార్‌ దేవులపల్లి

 

Advertisement

తప్పక చదవండి

Advertisement