నిమ్స్‌లో 14 ఏళ్ల బాలునికి అరుదైన చికిత్స | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో 14 ఏళ్ల బాలునికి అరుదైన చికిత్స

Published Sat, Jul 23 2016 8:54 PM

నిమ్స్‌లో 14 ఏళ్ల బాలునికి అరుదైన చికిత్స

 
‘మేజర్‌ హెపటెక్టమీ’తో బాధపడుతున్న బాలుడు
క్యాన్సర్‌ సోకిన 80 శాతం కాలేయం తొలగింపు
కోలుకున్న బాధితుడు..
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌
సాక్షి, సిటీబ్యూరో: నిమ్స్‌ వైద్యులు మరో అరుదైన చికిత్స చేశారు. కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతూ మృత్యువుతో పోరాడుతున్న ఓ బాలునికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. బాధితుడు కోలుకోవడంతో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన చౌదరి(14) కొంత కాలంగా మేజర్‌ హెపటెక్టమీ (కాలేయ క్యాన్సర్‌)తో బాధపడుతున్నాడు. చికిత ్స కోసం అనేక మంది వైద్యులను ఆశ్రయించాడు.
 
దీంతో వారు నిమ్స్‌లోని సర్జికల్‌ క్యాన్సర్‌ విభాగం అధిపతి డాక్టర్‌ సూర్యనారాయణరాజును సంప్రదించగా, ఆయన ఈ నెల 5న బాధితుడికి ఆపరేషన్‌ నిర్వహించి క్యాన్సర్‌ సోకిన 80 శాతం కాలేయాన్ని తొలగించారు. అతడిని ఐసీసీయూలో ఉంచి చికిత్స అందించారు. మెడికల్‌ సపోర్టుతో ఊపిరితిత్తులు, మూత్ర పిండాల పని తీరును మెరుగుపరి చారు. చిన్న పిల్లల్లో చాలా అరుదుగా కాలేయ క్యాన్సర్‌లు వెలుగు చూస్తాయని, అరుదైన ఈ మేజర్‌ హెపటెక్టమీతో బాధపడే వారికి చిన్న వయసులోనే ఇలాంటి చికిత్స చేయడం చాలా రిస్కుతో కూడినదని డాక్టర్‌lసూర్యనారాయణరాజు తెలిపారు. రూ. 10 లక్షలకు పైగా ఖర్చయ్యే ఈ ఆపరేషన్‌ను ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అతను కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశామన్నారు.  

Advertisement
Advertisement