అమ్మే.. అన్నీ..! | Sakshi
Sakshi News home page

అమ్మే.. అన్నీ..!

Published Sun, Dec 27 2015 3:42 AM

అమ్మే.. అన్నీ..! - Sakshi

చెట్టంత ఎదిగిన కొడుకు.. ఇంకేం.. అన్నీ చూసుకుంటాడనుంది ఆ తల్లి.. అయితే విధి ఆ తల్లీకొడుకులతో ఆడుకుంది.. ఆరు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు రెండు కాళ్లూ పోగొట్టుకున్నాడు.. దీంతో అమ్మే అతని ఆలనా, పాలనా చూస్తోంది.  బండమైసమ్మ ప్రాంతానికి పిచ్చమ్మ కుమారుడు సుమన్ వీల్‌చైర్‌కే పరిమితమయ్యాడు.  ఏం చేయాలన్నా, ఎక్కడకి వెళ్లాలన్నా తల్లి ఉండాల్సిందే. ఎప్పటికైనా తన కొడుకు మునుపటిలా అవుతాడనే నమ్మకంతో కంటికిరెప్పలా కాపాడుకుంటూ వస్తోంది. శనివారం గోశాల వద్ద ఇంటికి వెళుతూ సాక్షికి కనిపించారు.     
                           - ఫోటో: ఎం.రవికుమార్
 

Advertisement
Advertisement