సూపర్‌ షో | Sakshi
Sakshi News home page

సూపర్‌ షో

Published Mon, Aug 15 2016 9:15 PM

1949 మోడల్‌ కారు

ఖైరతాబాద్‌: దక్కన్‌ హెరిటేజ్‌ ఆటో మొబైల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం లుంబినీ పార్క్‌లో ఏర్పాటు చేసిన వింటేజ్‌ షో
సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. 1947కాలం నాటి బ్రిటన్‌ కారు, 1919 నాటి ఆస్టిన్‌–20, 1930కి చెందిన ఇటాలియన్‌ ఫియట్‌–514 కార్లతో పాటు నార్టన్, రాజ్‌దూత్, రాయల్‌ ఎన్‌ఫీల్డ్, వెస్పా వంటి ద్విచక్ర వాహనాలతో పాటు అతి చిన్న సైకిల్‌ ఆకట్టుకున్నాయి. వాహనాల చెంత నిల్చొని సందర్శకులు సెల్ఫీలు, ఫొటోలు దిగారు. షోలో అధునాతన బైక్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. షోకు వచ్చిన ద్విచక్ర వాహనదారులు జాతీయ పతాకాలు ఎగురవేస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement