15 నుంచి అవినీతిపై ఆందోళనలు: సురవరం | Sakshi
Sakshi News home page

15 నుంచి అవినీతిపై ఆందోళనలు: సురవరం

Published Sun, Aug 27 2017 3:22 AM

15 నుంచి అవినీతిపై ఆందోళనలు: సురవరం - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మోదీ పాలనలో దేశవ్యాప్తంగా పెచ్చరిల్లిపోతున్న అవినీతిపై సెప్టెంబర్‌ 15 నుంచి నెల రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు 22, 23వ తేదీల్లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నామన్నారు.

మఖ్దూం భవన్‌లో శనివారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్లు, వాటిలోని అంశాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిరర్థక ఆస్తుల పేరిట కార్పొరేట్‌ కంపెనీలు తీసుకున్న వేల కోట్ల రుణాలను రద్దు చేయడం సరికాదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement