హీటర్ ఎక్కువసేపు పెట్టానని కొట్టిండు! | Sakshi
Sakshi News home page

హీటర్ ఎక్కువసేపు పెట్టానని కొట్టిండు!

Published Tue, Sep 13 2016 3:00 AM

హీటర్ ఎక్కువసేపు పెట్టానని కొట్టిండు! - Sakshi

- తల్లిదండ్రులకు సుశ్రీత వాట్సాప్ మెస్సేజ్.. అనంతరం ఆత్మహత్య

భర్త, అత్తమామలపై కేసు


సాక్షి, హైదరాబాద్: ‘మళ్లీ బావ కొట్టిండు. నేను ఏమీ అనలేదు. హీటర్ కాసేపు ఎక్కువ పెట్టినని కొట్టిండు. అప్పటికీ చూసుకోలేదు తప్పైంది అన్నా. అయినా బాత్రూమ్‌లో స్నానం చేస్తుంటే వచ్చి కొట్టిండు. బయటకు వచ్చినాక బట్టలు కూడ వేసుకోలే... వాళ్ల అమ్మ ఉంది కింద. తోటి కోడలు వాళ్ల పిల్లలు చూస్తుండగానే బట్టలు లేకుంటా కొట్టాడు. మా మామయ్య పైకి వచ్చి ఆయన్నే సపోర్ట్ చేస్తుండు’... హైదరాబాద్‌లోని సైదాబాద్ ఠాణా పరిధిలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించిన సుశ్రీత తాను చనిపోవడానికి కొద్దిసేపటి ముందు తల్లిదండ్రులకు పంపిన వాట్సప్ మెస్సేజ్ ఇది. ఆమె భర్తతో పాటు అత్తమామల్నీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సైదాబాద్ డివిజన్ పూసలబస్తీకి చెందిన ఎస్.మోహన్ రాజ్ జీవీకే సంస్థలో సైంటిస్ట్. ఈయనకు పదేళ్ల క్రితం నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుశ్రీతతో(30) వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. వివాహమైన నాటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మరింత పెరిగాయి.
 

 హీటర్ ఎక్కువసేపు పెట్టావంటూ...

 ఆదివారం ఉదయం సుశ్రీత హీటర్‌తో నీళ్లు కాచుకుంది. హీటర్‌ను ఎక్కువసేపు పెట్టావంటూ మోహన్‌రాజ్ గొడవ పడి బాత్రూమ్‌లో ఉన్న సుశ్రీతపై చేయిచేసుకున్నాడు. ఆ సమయంలో బంధువులు సైతం అక్కడే ఉండటంతో సుశ్రీత మనోవేదనకు గురైంది.  విషయాన్ని తన తల్లిదండ్రులకు వాట్సప్ ద్వారా తెలిపింది. కొద్దిసేపటికే సీలింగ్ ఫ్యా నుకు ఉరేసుకుంది. బాధ్యులను  శిక్షించాలని సుశ్రీత కుటుంబ సభ్యులు ఆదివారం సైదాబాద్ పోలీసుస్టేషన్ వద్ద ధర్నా చేశారు.

 

 మార్చురీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

ఉస్మానియాలో  పోస్టుమార్టం అనంత రం మృతదేహాన్ని సుశ్రీత కుటుంబీకులకు అప్పగించారు. పూసలబస్తీలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆమె కుటుంబీకులు పోలీసులకు చెప్పారు. అయితే, సూర్యాపేటకే తీసుకువెళ్లాలని పోలీసులు సూచించారు. మహిళా సం ఘాలు బాధిత కుటుంబానికి మద్దతు తెలిపి పోలీసుల్ని అడ్డుకున్నాయి. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అంబర్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement