కార్యదర్శులే గ్రామాలకు కలెక్టర్లు | Sakshi
Sakshi News home page

కార్యదర్శులే గ్రామాలకు కలెక్టర్లు

Published Mon, Jan 30 2017 2:23 AM

కార్యదర్శులే గ్రామాలకు కలెక్టర్లు

పంచాయతీ సెక్రటరీల సదస్సులో స్వామిగౌడ్‌

సాక్షి, హైదరాబాద్‌: జిల్లాలకు కలెక్టర్లు లానే.. గ్రామ పంచాయతీలకు కార్యదర్శులే స్థానిక కలెక్టర్లని శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ అన్నారు. రాజేంద్రనగర్‌లోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శిక్షణ సంస్థ (టీసీపార్డ్‌)లో ఆదివారం జరిగిన టీఎన్జీవో పంచాయతీ కార్యదర్శుల సదస్సులో స్వామి గౌడ్‌ ప్రసంగించారు. గ్రామాలకు సర్పంచ్‌లు ముఖ్యమంత్రులైతే, వార్డు మెంబర్లు మంత్రు ల్లాంటి వారన్నారు. గ్రామాల అభివృద్ధికి వారందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన బాధ్యత కార్యదర్శు లపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో కార్యదర్శు లకు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించుకుంటూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పంచాయతీరాజ్‌ శాఖకు జూపల్లి కృష్ణా రావు లాంటి సమర్థు డైన మంత్రి ఉన్నా రని, సమస్యల వద్దకే ఆయనే వెళ్లి పరిష్కరి స్తారని పేర్కొన్నారు.

బంగారు తెలంగాణతోనే వారికి నివాళి..
తెలంగాణ కోసం అమరులైన వారి ఆకాంక్షల ను నెరవేర్చాల్సిన బాధ్యత అందరిపై ఉంద ని, బంగారు తెలంగాణ సాధనే అమరులకు అసలైన నివాళి అని మంత్రి జూపల్లి అన్నారు. తెలంగాణ సాధనలో ఉద్యోగుల పాత్ర మరవలేనిదని, అందరం సంఘటితంగా పనిచేసి బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలని కోరారు. కష్టపడి కాకుండా ఇష్ట పడి పనిచేస్తేనే నిర్దేశించుకున్న లక్ష్యాలు సులువుగా అధిగమించగలమన్నారు. ఇప్ప టికే టీఎస్‌ఐపాస్, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయవంటి కార్యక్రమాలతో దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, పంచాయతీ రాజ్‌ శాఖనూ ఆదర్శంగా నిలిపేందుకు కార్యదర్శులు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

2018 అక్టోబర్‌ 2నాటికి తెలంగాణను వంద శాతం బహిరంగ మల విసర్జన లేని రాష్ట్రంగా మార్చడంలో కార్యదర్శులు కీలకం గా వ్యవహరించాలన్నారు. గ్రామ కార్యద ర్శులను రేషనలైజేషన్‌ చేయడం ద్వారా పనిభారాన్ని తగ్గించేలా చర్యలు తీసుకుంటు న్నామని మంత్రి జూపల్లి చెప్పారు. పంచాయతీ కార్యదర్శుల సంఘం రూపొం దించిన నూతన సంవత్సర డైరీని, కేలండర్‌ను జూపల్లి, స్వామిగౌడ్‌ ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో టీఎన్జీవోల సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాదరావు, అధ్యక్షుడు కారెం రవీందర్‌రెడ్డి, పంచాయతీ కార్యద ర్శుల సంఘం ప్రతినిధులు పర్వతాలు, శేషు, రాజేందర్, రామకృష్ణ, ఉపేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement