రాష్ట్రానికి డెంగీ సోకింది: భట్టి | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి డెంగీ సోకింది: భట్టి

Published Wed, Nov 2 2016 1:52 AM

రాష్ట్రానికి డెంగీ సోకింది: భట్టి - Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో డెంగీ, విషజ్వరాలతో ప్రజ లు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క మంగళవారం విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి డెంగీ సోకిందన్నారు. అధికారులు, ప్రభుత్వ యంత్రాంగమంతా మంత్రులకు, ఎమ్మెల్యేలకు సేవలు చేయడంలో మునిగిపోయారన్నారు. ఖమ్మం జిల్లాలోని బోనకల్, రావినూతల, ఆళ్లపాడు తదితర గ్రామాల్లో డెంగీ మరణాలు పదుల సంఖ్యను దాటిపోయాయన్నారు.

ఒక్క రావినూతలలోనే వైద్య ఖర్చులకు పేదలు రూ.10కోట్లు ఖర్చుపెట్టారన్నారు. వైద్యానికి డబ్బు లేని పేదలు చాలామంది ప్రాణాలు కోల్పోయారన్నారు. రాష్ట్రం జ్వరాలతో ఇబ్బందులు పడుతుంటే... ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారని గవర్నర్ ఎలా పొగుడుతారన్నారు. డెంగీతో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement