లాసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం | Sakshi
Sakshi News home page

లాసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభం

Published Tue, May 24 2016 10:01 AM

Telangana Law Common Entrance Test Begin

హైదరాబాద్ : తెలంగాణలో లాసెట్ ప్రవేశ పరీక్ష ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి ఇవాళ లాసెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందు మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్రవేశ పరీక్షకు భగీరథ ఎస్-1, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు రామప్ప ఎస్-1 ప్రశ్నాపత్రాన్ని  కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ చిరంజీవులు ఎంపిక చేశారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు ప్రవేశ పరీక్షకు 13,323 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశ పరీక్షకు 4,104 మంది, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశపరీక్షకు 1,793 మంది.. మొత్తంగా 19,220 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు.

ఇక మూడేళ్లు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ ప్రవేశపరీక్ష ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశపరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. రాష్ట్రంలోని 14 రీజినల్ సెంటర్ల పరిధిలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement