తెలంగాణ టూరిజానికి ప్రపంచ ఖ్యాతి | Sakshi
Sakshi News home page

తెలంగాణ టూరిజానికి ప్రపంచ ఖ్యాతి

Published Tue, Jun 2 2015 12:55 AM

తెలంగాణ టూరిజానికి ప్రపంచ ఖ్యాతి

సాక్షి, సిటీబ్యూరో : తెలంగాణ టూరిజానికి ప్రపంచ ఖ్యాతి రావాలని ఆశిస్తున్నామని, అందుకు తగ్గట్లుగానే తెలంగాణ స్టేట్ టూరిజం డెలప్‌మెంట్ కార్పొరేషన్(టీఎస్‌టీడీసీ) అభివృద్ధి పనులు చేసి చూపిస్తూ ముందుకు సాగుతుందని టీఎస్‌టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు తెలిపారు. తెలంగాణ ఆవిర్భాదినోత్సవం సందర్భంగా ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

 పర్యాటకుల శ్రేయస్సే ముఖ్యం
 తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆదాయం కన్నా పర్యాటకుల శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతుందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పచ్చని ప్రాంతాల వైపు ఆకర్షించేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదన్నారు. టూరిజం అభివృద్ధిపై స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. సహజ సిద్ధమైన వనరులు, కొండలు, కోటలు, రమణీయ ప్రదేశాలు, దేవాలయాలు, వనమూలికలు దొరికే గుట్టలు..ఒక్క తెలంగాణకే సొంతమని చెప్పారు.

 ప్రకృతి వరప్రసాదాల అభివృద్ధి..
 చారిత్రక ప్రదేశాలైన నేలకొండపల్లి, నిజాం, మెదక్ కోటలు, రాణి రుద్రమదేవి మరణించిన చందుపట్ల, రాచకొండ తదితర ప్రాంతాలను వెలుగులోకి తెస్తున్నామన్నారు. ప్రకృతి వరప్రసాదాలైనా కుంతాల జలపాతం, జోడేఘాట్ అరణ్యప్రాంతం, వరంగల్ దగ్గర కి.మీ ఉన్న పాండవుల గుట్ట, రామగిరి ఖిల్లాను, శ్రీశైలం నుంచి అలంపూర్ తీర ప్రాంతం లాంటి ఎన్నో చూడదగ్గ ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. తెలంగాణలోని హైవేలపై హరిత హోటళ్లు- కాంప్లెక్స్‌లు నిర్మిస్తామన్నారు. విదేశీ పర్యాటకుల కోసం హైదరాబాద్‌లో పది గోల్ఫ్ కోర్టులు అభివృద్ధి చేస్తామన్నారు. యువత కోసం భువనగిరి కోట వద్ద పర్వతారోహణ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

 బుద్వేల్‌లో..
 బుద్వేల్ టూరిజం ప్రాజెక్ట్‌లో సెవెన్‌స్టార్ హోటల్. గోల్ఫ్ కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇది పూర్తిగా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దాదాపు రూ.300 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నామని చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement