కీలక నిందితుడిని కర్నూలులో
అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్స్
1998లో ఏపీఎస్పీలో చేరి, 2002లో గ్రేహౌండ్స్‌కు బదిలీ అయిన ఓబులేసు
సాక్షి న్యూస్‌నెట్‌వర్క్: అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ కంభం నిత్యానంద రెడ్డిపై కానిస్టేబుల్ ఓబులేసు కిడ్నాప్‌యత్నం, కాల్పుల ఘాతుకానికి పాల్పడింది పోలీసు ముఠాయేనని తేలింది. బుధవారం ఉదయం 7.15 గంటలకు కేబీఆర్ పార్కులో వాకింగ్ చేసి నిత్యానందరెడ్డి కారు ఎక్కుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. టవర్ లొకేషన్ ఆధారంగా హైదరాబాద్ నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిందితుడు ఓబులేసును గురువారం రాత్రి కర్నూలులో అరెస్ట్ చేశారు. అక్రమంగా డబ్బులు సంపాదించాలనే దుర్బుద్ధితోనే కిడ్నాప్‌కు పాల్పడేందుకు యత్నించానని పోలీసులు విచారణలో ఓబులేసు వెల్లడించాడు.
గతంలో కూడా మాజీ చీఫ్ సెక్రటరీ మనవడిని కిడ్నాప్ చేసినట్లు అంగీకరించాడు. అదే తరహాలో నిత్యానందరెడ్డిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయడానికి పథకం వేశానని చెప్పాడు. దుర్వ్యసనాలకు బానిసైన ఓబులేసు అప్పులపాలుకావడం, మరోవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే దురాలోచన అతనిలో కలిగింది. దీంతో పథకం ప్రకారం తోటి గ్రే హౌండ్స్ ఉద్యోగికి చెందిన ఏకే-47ను తస్కరించాడు. శక్తివంతమైన ఆయుధం ఉన్నదనే ధైర్యంతో ఇద్దరు హోంగార్డులు, మరో కానిస్టేబుల్‌తో ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. ధనవంతులు, వారి పిల్లలు వాకింగ్ వచ్చే కేబీఆర్ పార్క్‌పై కన్నేశారు. ఇక్కడ కిడ్నాప్ చేసిన వారిని నిర్బంధించి డబ్బులు డిమాండ్ చేసేం దుకు శివార్లలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు తెలిసింది.
ఇలా చిక్కాడు: చందనాబ్రదర్స్‌లో బట్టలు ఖరీదు చేసిన రసీదు ఆధారంగా నిందితుడు కానిస్టేబుల్ ఓబులేసుగా గుర్తించిన విషయం తెలిసిందే. కాల్పుల ఘటన అనంతరం అతను నేరుగా అమీర్‌పేటకు వచ్చి అక్కడ ప్రైయివేటు బస్సులో కర్నూలుకు వెళ్లాడు. బస్సు ఎక్కుత్నున దృశ్యాలు అమీర్‌పేటలోని సీసీకెమెరాల్లో రికార్డయ్యాయి. గురువారం తెల్లవారుజామున కర్నూలుకు చేరుకున్న ఓబులేసు కొత్తబస్టాండ్ సమీపంలోని ఆదిత్య లాడ్జిలో తప్పుడు చిరునామాతో గది అద్దెకు తీసుకున్నాడు.
టాస్క్‌ఫోర్స్ బృందం గురువా రం తెల్లవారుజామున కర్నూలుకు చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఆదిత్య లాడ్జి రూం నంబర్-111లో ఉన్న ఓబులేసును మీరెవరంటూ ప్రశ్నించగా... తా ను ఉద్యోగంకోసం వచ్చానంటూ నమ్మబలికాడు. పోలీసులు మిగతా గదుల్లో తనిఖీ నిర్వహిస్తుండగా వారి కళ్లుగప్పి పరారయ్యాడు. అనంతరం కర్నూలు జనరల్ ఆసుపత్రి ఎదుటనున్న మధుర లాడ్జిలో అద్దెకు దిగాడు. అరెస్టు చేస్తారనే భయంతో పురుగుల మందు తాగేందుకు సిద్ధం కాగా పోలీసులు అక్కడికి చేరుకుని చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
12 ఏళ్లు గ్రేహౌండ్స్‌లోనే: ఓబులేసు 1998లో ఏపీఎస్పీలో చేరి, 2002లో గ్రౌహౌండ్స్‌కు బదిలీ అయ్యా రు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ అయ్యాడు. 15 రోజుల నుంచి విధులకు హాజరుకావడం లేదు. ఓబులేసును శుక్రవా రం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నా యి. ఓబులేసు కాల్పుల ప్రచారంతో స్వగ్రామం వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల మండలం తిరువెంగళాపురం ఉలిక్కిపడింది. అతని తండ్రి మైఖేల్‌ను పోలీసు లు విచారించగా ఓబులేసు రెండేళ్లుగా గ్రామానికి రాలేదన్న విషయాన్ని నిర్ధారించుకున్నారు. అతడు అవి వాహితుడు. ఈ నేరం చేశాడంటే నమ్మలేమని బంధువులు చెప్పారు.
డబ్బు కోసమే కిడ్నాప్ యత్నం
Published Fri, Nov 21 2014 1:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement