‘గురుకుల’ సవరణ నోటిఫికేషన్‌ ఆలస్యం! | Sakshi
Sakshi News home page

‘గురుకుల’ సవరణ నోటిఫికేషన్‌ ఆలస్యం!

Published Wed, Feb 15 2017 12:31 AM

‘గురుకుల’ సవరణ నోటిఫికేషన్‌ ఆలస్యం! - Sakshi

చైనా పర్యటన నుంచి మంత్రులు తిరిగి వచ్చాకే అర్హతలపై నిర్ణయం
ఈ నెల 21 తరువాతే తదుపరి చర్యలు
నెలాఖరుకు నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం


సాక్షి, హైదరాబాద్‌: గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన సవరణ నోటిఫికేషన్‌ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. చైనా పర్యటనకు వెళ్లిన మంత్రులు తిరిగి వచ్చాకే.. నోటిఫికేషన్‌లో విద్యార్హతలు, మార్కుల శాతం, వయో పరిమితి తదితర అంశాలపై తుది నిర్ణయం వెలువడనుంది. ఆ లోగా నోటిఫికేషన్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులకు సంబంధించిన నివేదికను సిద్ధం చేయాలని సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు.

కొనసాగుతున్న కసరత్తు..
గురుకులాల్లోని టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ నోటి ఫికేషన్‌లో.. అభ్యర్థులు డిగ్రీ, పీజీల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్న విషయం తెలిసిం దే. అది 50 శాతం మార్కులుంటే చాలన్న జాతీయ ఉపా ధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలకు విరుద్ధ మంటూ అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీనిపై జోక్యం చేసుకున్న సీఎం కేసీఆర్‌.. ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారమే అర్హతలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లో మార్పులు, చేర్పులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఎన్నికల కోడ్‌ వర్తించదా?..
ప్రస్తుతం మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన రోజే గురుకుల నోటిఫికేషన్‌ కూడా జారీ అయింది. కానీ ఈ నోటిఫికేషన్‌కు ఎన్నికల కోడ్‌ వర్తించదని.. టీచర్లకు సంబంధించిన ఎన్నికలకు, కాబోయే టీచర్లకు సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈసారి ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు. వీళ్లంతా గురుకుల టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధ మయ్యారు. దీంతో ఎన్నికల సమయంలో టీచర్‌ పోస్టుల నోటిఫికేషన్‌ ద్వారా నేరుగా ప్రయోజనం కల్పించినట్లు అవు తుందని, ఇది ఎన్నికల్‌ కోడ్‌ పరిధిలోకి వస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విదేశ పర్యటన నుంచి మంత్రులు తిరిగొచ్చాక, దీనిపై చర్చించాలని భావిస్తున్నారు.

వయో పరిమితి సడలించండి..
అర్హతలు, నిబంధనలు, వయో పరిమితి తదితర అంశాలకు సంబంధించి ఉపాధ్యాయ అభ్యర్థులు మంగళవారం ప్రభు త్వ సీఎస్‌ ఎస్పీ సింగ్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. టీచర్‌ పోస్టులకు ప్రభుత్వం ఇచ్చిన పదేళ్ల ప్రత్యేక మినహా యింపు కాకుండా సాధారణ గరిష్ట వయోపరిమితి 39 ఏళ్లు గా ఉందని.. కానీ గురుకుల నోటిఫికేషన్‌లో 34 ఏళ్లుగానే పరిగణనలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. గరిష్ట వయో పరిమితిని 39 ఏళ్లకు పెంచాలని, కనీసం రెండేళ్ల సడలింపు ఇస్తే అనేక మందికి ప్రయోజనం చేకూరుతుందని విజ్ఞప్తి చేశారు. మరోవైపు డిగ్రీ, డీఎడ్‌ కలిగిన అభ్యర్థులకు టీజీటీ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను కలసి విజ్ఞప్తి చేశారు.

విదేశీ పర్యటనలో మంత్రులు
మరోవైపు విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగ దీశ్‌రెడ్డిలు చైనా పర్యటనకు వెళ్లారు. గురుకుల నోటిఫి కేషన్‌లో ఎస్సీ గురుకులాలతో పాటు విద్యాశాఖ పరిధి లోని గురుకులాల పోస్టులు కూడా ఉన్నాయి. దీంతో మంత్రులు ఈ నెల 21న తిరిగి వచ్చాకే విద్యార్హతలు, ఇతర నిబంధనలపై నిర్ణయం తీసుకోనున్నారు. సంబం« దిత ఫైలుపై గురుకులాలకు సంబంధించిన అన్ని శాఖల మంత్రులు సంతకాలు చేశాక.. సీఎం కేసీఆర్‌ ఆమోదానికి పంపుతారు. సీఎం ఆమోదం అనంతరం టీఎస్‌పీఎస్సీకి ఉత్తర్వులు వెళ్తాయి. తర్వాత నాలుగైదు రోజులకు టీఎస్‌పీఎస్సీ సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలాఖరున సవరణ నోటిఫికేషన్‌ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.

Advertisement
Advertisement