వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణం | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణం

Published Sat, Nov 30 2013 4:43 AM

The reason for the interest of traders note

సంజీవరెడ్డినగర్,న్యూస్‌లైన్: రియల్టర్ అనిల్‌కుమార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేయడానికి వడ్డీ వ్యాపారుల వేధింపులో కారణమని పోలీసులు నిర్ధారించారు. యూసుఫ్‌గూడలోని మార్గిహోటల్‌లో భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అనిల్‌కుమార్ గురువారం నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించాడు. అతను అక్కడికక్కడే చనిపోగా.. భార్య, పిల్లలు ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న విషయం తెలిసిందే. హోటల్‌గదిలో మృతుడు రాసిన సూడైడ్‌నోట్ పోలీసులకు దొరికింది.  

రియల్ ఎస్టేట్ వ్యాపారం నిమిత్తం కొందరివద్ద అప్పులు చేశానని, రుణదాతల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నామని అందులో రాసి ఉంది. ముఖ్యంగా మంగిలాల్‌గాంధీ, కుమార్‌యాదవ్,రవి అనే వ్యాపారుల వేధింపులు తట్టుకోలేకే  కుటుంబం సహా చనిపోతున్నానని అనిల్‌కుమార్ రాశాడు. పోలీసుల కథనం ప్రకారం...అనిల్‌కుమార్ తల్లి భారతి పేరుపై శ్రీనగర్‌కాలనీలో రూ.70 లక్షల విలువ చేసే ఇల్లు ఉంది. ఆ ఇంటి పేపర్లు బ్యాంకులో పెట్టి గతంలో రూ. 6 లక్షల అప్పు తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవడంతో ఇల్లు వేస్తామని బ్యాంక్ అధికారులు నోటీసులు పంపారు.

అనిల్ బల్కంపేటలో ఉండే తన స్నేహితుడు కుమార్‌కు ఈ విషయం చెప్పగా.. అతను బ్యాంక్‌లో డబ్బు చెల్లించి, ఇంటి పేపర్లు తన వద్దే ఉంచుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత కుమార్.. అనిల్ తల్లిని బ్యాం క్‌కు తీసుకెళ్లి తన వద్ద ఉన్న ఇంటి పేపర్లు పెట్టి  రూ. 25 లక్షల లోన్ తీసుకున్నాడు. ఈ అప్పు తీర్చకపోవడంతో వడ్డీతో కలిపి బాకీ మొత్తం రూ. 40లకు చేరింది.   బ్యాంక్ నోటీసు రావడంతో అనిల్ ఈసారి స్థానిక వడ్డీవ్యాపారి మం గీలాల్ గాంధీని ఆశ్రయించాడు. అతను రూ. 40 లక్షలను బ్యాంక్‌లో చెల్లించి ఇంటి పేపర్లు తన వద్ద పెట్టుకున్నాడు.  12 శాతం వడ్డీతో కలిపి ఈ అప్పు రూ. 42 లక్షలు అయిందని, వెంటనే తిరిగి చెల్లించాలని, లేదా ఇల్లు తన పేర రాసి ఇవ్వాలని ఒత్తిడి చేశాడు.
 
అంతేగాక ఆ ఇంట్లోని ఓ పోర్షన్‌ను ఆక్రమించాడు. మంగీ లాల్ మరింత వేధిస్తుండటంతో అనిల్ 3 నెలల క్రితం కూకట్‌పల్లిలో ఉన్న మరో ఇంటిని రూ. 30 లక్షలకు అమ్మేసి.. వచ్చిన డబ్బును మంగీ లాల్‌కు చెల్లించాడు. అయితే, మిగతా 12 లక్ష లు కూడా చెల్లించాలని అతను వే ధించసాగా డు. మంగిలాల్ తన వద్ద ఉన్న ఇంటిపేపర్ల సహాయంతో బంధువుల పేరుతో జీపీఏ చే యించాడు. ఇదిలా ఉండగా, అనిల్ మరో స్నే హితుడికి డబ్బు అవసరం కావడంతో తాను కష్టాల్లో ఉండి కూడా బాలానగర్‌కు చెందిన ఫైనాన్సర్ వద్ద రూ.2 లక్షల అప్పు ఇప్పించా డు.

అప్పు తీసుకున్న స్నేహితుడు పరారీ కావడంతో వడ్డీతో కలిపి రూ.4 లక్షలు నీవే చెల్లించాలని రవి.. అనిల్‌ను వేధించాడు. భార్యతో పాటు మరికొందరు మహిళలను తీసుకొచ్చి అనిల్ ఇంటి వద్ద గొడవ చేయించేవాడు. ఈ నేపథ్యంలోనే జీవితంపై విరక్తి చెందిన అనిల్ కుటుంబసభ్యులందరితో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 25న మార్గి హోటల్‌లో దిగి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కాగా, ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న అనిల్ భార్య లావణ్య,కూతుళ్లు ఆలేఖ్య,అకిల,ఆకాశల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉం దని, ఎలాంటి ప్రాణాపాయంలేదని వైద్యులు శుక్రవారం వెల్లడించాడు.  
 

Advertisement
Advertisement