ఆర్థిక సంక్షోభంలో ఆర్టీసీ | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంక్షోభంలో ఆర్టీసీ

Published Sun, Mar 13 2016 12:48 AM

ఆర్థిక సంక్షోభంలో ఆర్టీసీ

♦ రికార్డు స్థాయి నష్టాలతో కుదేలవుతున్న సంస్థ
♦ ఈ ఆర్థిక సంవత్సరం పది నెలల్లో రూ.545 కోట్ల నష్టం
♦ గతేడాది కన్నా రూ.211 కోట్లు ఎక్కువ నష్టం
♦ వేతన సవరణతో భారీగా పెరిగిన జీతాల భారం
♦ ప్రభుత్వం నుంచి సాయం అందక దుర్భర పరిస్థితి
♦ చార్జీల పెంపుతో గట్టెక్కాలని యోచిస్తున్న ఆర్టీసీ
 
 సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ తీవ్ర నష్టాలు మూటగట్టుకునే దిశగా సాగుతోంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో ఎన్నడూ లేనంత ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఈ ఆర్థిక సంవత్సరం పది నెలల (జనవరి నాటికి) ఆ ర్థిక పరిస్థితిపై అధికారులు తాజాగా లెక్కలు వేశారు. జనవరి నాటికి సంస్థ నష్టాలను రూ.545 కోట్లుగా తే ల్చారు. అంతకుముందు ఏడాది పది నెలల నష్టాల తో పోలిస్తే ఇది ఏకంగా రూ.211 కోట్లు అధికం. 2014-15లో జనవరి నాటికి రూ.334 కోట్ల నష్టాలు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెల ల నష్టాలు ఇంకా తేలాల్సి ఉంది. అవి కూడా కలిపితే నష్టాల మొత్తం రూ.650 కోట్లు దాటుతుందని అంచ నా వేస్తున్నారు.

దీంతో పరిస్థితి చేయిదాటిపోతోంద న్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం సాయం చేయని పక్షంలో సంస్థకు ప్పకూలుతుందని పేర్కొంటున్నారు. 2016 -17 ఆర్థి క సంవత్సరానికిగాను 14న ప్రవేశపెట్టను న్న బడ్జెట్ లో ఆర్టీసీకి పెద్దగా నిధులు ప్రకటించలేదని సమాచా రం. కేవలం కొత్త బస్సులు కొనేందుకు మాత్రమే రూ.42 కోట్లను ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. బ స్సు పాసుల రాయితీ కింద ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.500 కోట్ల రీయింబర్స్‌మెంటు మొత్తాన్ని ప్ర భుత్వం నేరుగా చెల్లించకుండా బ్యాంకుల నుంచి అ ప్పు ద్వారా సమకూర్చుకోవాలని సూచించబోతోం ది. ఇటీవలి కేబినెట్‌లో ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. దీంతో సిబ్బందికి జీతాలు చెల్లించేందుకు కూ డా ఆర్టీసీ వద్ద నిధులు లేవు.

 జీతాల భారం తడిసిమోపెడు
 గత సంవత్సరం ఆర్టీసీ సిబ్బందికి ప్రభుత్వం 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన తర్వాత సంస్థ ఖజానా పరిస్థితి తీవ్రంగా దిగజారింది. ఆ భారాన్ని పూర్తిగా సంస్థపై పడకుండా ఆదుకుంటానన్న ప్రభుత్వం ఇ ప్పటి వరకు పెద్దగా చర్యలు తీసుకోలేదు. గత ఆర్థిక సంవత్సరం (వేతన సవరణకు ముందు) ఏప్రిల్ నుం చి జనవరి వరకు జీతాల రూపంలో రూ.1,375 కోట్లు చెల్లించగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆ మొత్తం రూ.1,813 కోట్లకు చేరింది. అంటే అదనంగా రూ.438 కోట్ల భారం పడిందన్న మాట. ఇక ఫిట్‌మెం ట్ బకాయిలకు సంబంధించి తొలివిడతగా రూ.200 కోట్లు చెల్లించాల్సి రావటం నష్టాలను మరింత పెంచేసింది. కనీసం ఆ బకాయిలనైనా ప్రభుత్వం చెల్లిస్తుందని ఆశించిన ఆర్టీసీకి నిరాశే ఎదురైంది.

 చార్జీల పెంపుతో గట్టెక్కాలని..
 ప్రభుత్వం సాయం లేక, నష్టాలను అధిగమించలేక చతికిలపడ్డ ఆర్టీసీ ఇక బస్సు చార్జీలపైనే ఆశలుపెట్టుకుంది. ఇప్పటికే చార్జీల పెంపునకు సంబంధించి మూడుసార్లు ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అవి పెండింగులో ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత చార్జీలను పెంచలేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేనందున మరోసారి ప్రతిపాదించి సీఎంను ఒప్పించాలని ఆర్టీసీ భావిస్తోంది. తాజా నష్టాల తీవ్రతను ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. సాయం చేయాలని కోరింది. కానీ ఆ పరిస్థితి లేదని పరోక్షంగా సీఎం తే ల్చి చెప్పినందున ఇక చార్జీల పెంపు అనివార్యమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. 12 శాతం నుంచి 15 శాతం మేర పెంచి రూ.800 కోట్ల మేర రాబడిని పెంచుకోవాలని ఆర్టీసీ చూస్తోంది. బడ్జెట్ సమావేశాల తర్వాత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement
Advertisement