గల్ఫ్‌ బాధితులకేదీ భరోసా? | Sakshi
Sakshi News home page

గల్ఫ్‌ బాధితులకేదీ భరోసా?

Published Wed, May 10 2017 1:38 AM

గల్ఫ్‌ బాధితులకేదీ భరోసా? - Sakshi

ప్రభుత్వంపై విపక్షాలు, టీజేఏసీ మండిపాటు
► వలస వెళ్లిన వారి రేషన్‌ కార్డులను తీసేస్తున్నారు
► ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారు
► ‘గల్ఫ్‌ బాధితులకు భరోసా’ సెమినార్‌ను నిర్వహించిన టీపీసీసీ  


సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలోనే గల్ఫ్‌ కార్మికులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని..  సీఎం కేసీఆర్‌ ఉత్త మాటలు చెప్పడం తప్ప ఆచరణలో చర్య లేమీ తీసుకోవడం లేద ని విపక్షాలు, టీజేఏసీ మండిపడ్డాయి. ‘గల్ఫ్‌ బాధితులకు భరోసా’ పేరిట టీపీసీసీ హైదరాబాద్‌లో మంగళవారం సెమినార్‌ను నిర్వహించింది.

మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్ర మంలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం, ఏఐసీసీ కార్య దర్శి ఆర్‌సీ కుంతియా, కాంగ్రెస్‌ సీనియర్లు షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, టి.జీవన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, మర్రి శశిధర్‌రెడ్డి, టీడీపీ పొలి ట్‌బ్యూరో సభ్యుడు ఇ.పెద్దిరెడ్డి, సీపీఐ శాసన సభాపక్ష మాజీ నేత గుండా మల్లేశ్, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు నర్సింగరావు, సాయిబాబు తదితరులు మాట్లాడారు.

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి 100 కోట్లు
గల్ఫ్‌ నుంచి రోజూ సగటున ఐదుగురు వలస కార్మికుల మృతదేహాలు వస్తున్నాయంటే పరి స్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థం చేసు కోవచ్చన్నారు. గల్ఫ్‌ జైళ్లలో మగ్గుతున్న వారికి తక్షణమే న్యాయ సహాయం అందించి, రాష్ట్రా నికి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రె స్‌ అధికారంలోకి వస్తే ఏటా గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి 100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. గల్ఫ్‌లో చనిపోయిన వారికి 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని.. కేరళ తర హాలో ప్రవాసీ బీమా అందిస్తామని చెప్పారు.  

ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా పంపాలి
గల్ఫ్‌కు వెళ్లేవారిని అన్ని అర్హతలు, ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వ ఏజెన్సీలే పరిశీలించి పంపాలని కోదండరాం సూచించారు. గల్ఫ్‌కు వెళ్లిన వారి రేషన్‌ కార్డులను తొలగించడం సరికాదన్నారు. ఎన్నారై డిపార్ట్‌మెంట్‌ను పునరుద్ధరించాలని, ఉపాధి కల్పనపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు.

ఎన్నారై విధానమేదీ?: షబ్బీర్‌ అలీ
వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.4.5 కోట్లతో తొలిసారిగా ఎన్నారై కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారని షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. దానిద్వారా చాలా సమస్యలను పరిష్కరించామని, 1,250 మందిని ఉచితంగా విమానాల్లో తిరిగి తీసుకొచ్చామని తెలిపారు.

గల్ఫ్‌ ఏజెంటుగా కేసీఆర్‌
రాష్ట్రంలో ఉపాధి లేక అప్పులు చేసి గల్ఫ్‌కు వెళ్లినవారికి కాంగ్రెస్‌ హయాంలోనే కొంత న్యాయం జరిగిందని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. గల్ఫ్‌ బాధితుల సమస్యలపై అసెంబ్లీని సమావేశపర్చి చర్చించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత సీఎం కేసీఆర్‌ గతంలో గల్ఫ్‌ ఏజెంట్‌గా పనిచేశారని.. అక్కడి సమస్యలన్నీ కేసీఆర్‌కు తెలుసని గుండా మల్లేశ్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ గల్ఫ్‌ బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్న ట్టుగా నటిస్తున్నారే తప్ప ఆచరణలో చాలా పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. సిరిసిల్లలో కార్మికులతో వెట్టి జరుగుతుంటే సీఎం కేసీఆర్‌కు, మంత్రి కేటీఆర్‌ కు పట్టడంలేదని సాయిబాబు మండిపడ్డారు. గల్ఫ్‌ కార్మికుల కష్టాలు ప్రభుత్వానికి కనబడటం లేదని విమర్శించారు.

Advertisement
Advertisement