డైట్‌సెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి | Sakshi
Sakshi News home page

డైట్‌సెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి

Published Sun, Aug 9 2015 8:36 AM

Today diet exam in telangana

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న డైట్సెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ చిరంజీవులు వెల్లడించారు. చిరంజీవులు హైదరాబాద్లో మాట్లాడుతూ... ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

అలాగే 1,11,206 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్ష ఉదయం 10.00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 లకు ముగుస్తుందన్నారు.   కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రాథమిక విద్యా కమిషనర్ చిరంజీవులు తెలిపారు.

Advertisement
Advertisement