నేడు ఈసెట్‌-2017 | Sakshi
Sakshi News home page

నేడు ఈసెట్‌-2017

Published Sat, May 6 2017 12:41 AM

Today is Eset-2017

ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు: కన్వీనర్‌

సాక్షి, హైదరాబాద్‌: టీఎస్‌ ఈసెట్‌-2017 పరీక్షకు సర్వం సిద్ధమైంది. శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25,138 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. మొత్తం 4 నగరాల్లో 81 కేంద్రాలను ఏర్పాటు చేసింది. కరీంనగర్‌లో 5, ఖమ్మంలో 5, వరంగల్‌లో 6, హైదరాబాద్‌-1 పరిధిలో 25, హైదరాబాద్‌-2 పరిధిలో 13, హైదరాబాద్‌-3 పరిధిలో 12, హైదరాబాద్‌-4 పరిధిలో 15 పరీక్షా కేంద్రాలున్నాయి. 

అభ్యర్థులు ecet.tsche.ac.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. హాల్‌టికెట్‌తో పాటు ఆన్‌లైన్‌ దరఖాస్తుపత్రం ప్రింట్‌అవుట్, ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని ఈసెట్‌ కన్వీనర్‌ స్పష్టం చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement