టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ అప్‌డేట్స్‌

Published Sun, Mar 5 2017 6:40 AM

today news updates

సామూహిక వివాహాలు
శ్రీకాకుళం జిల్లా నువ్వలరేవులో నేడు సామూహిక వివాహాలు. ఒక్కటికానున్న వంద జంటలు, మూడు రోజులపాటు పెళ్లి వేడుకలు.

నివాస గృహాల ప్రారంభం
హైదరాబాద్‌: రాజ్‌భవన్‌లో సిబ్బంది నివాస గృహాల ప్రారంభం నేడు. గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గృహాలను ప్రారంభించనున్నారు.

శాసనసభ వెబ్‌సైట్‌
సోమవారం తెలంగాణ శాసనసభ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున‍్నారు. తెలుగు, ఉర్దూ భాషల్లో వెబ్‌సైట్‌ ప్రారంభం కానుంది.

తిరుపతి: ఇవాళ పేరురుబండపై వకుళామాత ఆలయానికి భూమిపూజ.

రెండో టెస్ట్‌
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 189 పరుగులకే ఆలౌటై కష్టాల్లో పడింది. ఆస్ట్రేలియా 40/0 తో పట్టుబిగిస్తోంది. ఇవాళ్టి రెండోరోజు మ్యాచ్‌లో ఆసీస్‌ను బ్యాట్స్‌మెన్‌ను త్వరగా పెవిలియన్‌కు చేర్చితేనే భారత్‌ మరో ఓటమి నుంచి బయటపడుతుంది.

Advertisement
Advertisement