టుడే అప్ డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Tue, Mar 29 2016 7:45 AM

Today updates

  • నేడు పద్దులపై ఏపీ అసెంబ్లీలో కొనసాగనున్న చర్చ. నేడు, రేపు సభకు హాజరవ్వాలని ఎమ్మెల్యేలకు విప్ జారీచేసిన వైఎస్ఆర్ సీపీ
  • ద్రవ్య వినిమయ బిల్లులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ
  • అసోంలో ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలలో పాల్గొననున్న రాహుల్ గాంధీ
  • నేడు విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • నేడు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు
  • నేడు తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు
  • ద్రవ్య వినిమయ బిల్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపు బిల్లు పై చర్చ. అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ బిల్లు, రాజీవ్ గాంధీ ఐఐటీ బిల్లులపై చర్చ
  • తెలంగాణ మార్కెట్ కమిటీల చట్టసవరణ బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి హరీష్ రావు
  • ఢిల్లీలో తెలంగాణ మంత్రి కేటీఆర్ పర్యటన. నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్న కేటీఆర్
  • నేడు ఢిల్లీలో హెచ్సీయూ పరిణామాలపై రాష్ట్రపతిని కలవనున్న టీకాంగ్రెస్ నేతలు
  • నేటి నుంచి ఏపీలో బంగారం షాపులు బంద్. కేంద్ర ఎక్సైజ్ పన్నును నిరసిస్తు బంద్ చేపట్టిన వ్యాపారులు
  • తెలంగాణలో నేటి నుంచి జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు
  • ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పిటిసన్. నైనిటాల్ హైకోర్టులో నేడు కూడా కొనసాగనున్న విచారణ

  •  

Advertisement
Advertisement