విద్యాశాఖ లో ఫిర్యాదుల 'సెల్' | Sakshi
Sakshi News home page

విద్యాశాఖ లో ఫిర్యాదుల 'సెల్'

Published Wed, Jul 16 2014 1:31 AM

విద్యాశాఖ లో ఫిర్యాదుల 'సెల్' - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా వస్తున్న ఫిర్యాదులను స్వీకరించేందుకు ఈ విభాగంలో నలుగురు సిబ్బందిని నియమించారు. గుర్తింపులేని పాఠశాలలు, అదనపు ఫీజుల వసూళ్లు, పాఠశాలల పేర్లలో (కాన్సెప్ట్, ఒలంపియాడ్, టెక్నో.. వంటి) ఆకర్షక పదాలు, పాఠశాలల వేళలు తదితర వాటిపై విద్యార్థుల తల్లిదండ్రులకు అభ్యంతరాలు ఉంటే, నేరుగా గన్‌ఫౌంఢ్రీలోని డీఈవో కార్యాలయానికి వచ్చి రాతపూర్వకంగా లేదా ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. బుధవారం నుంచి అన్ని పనిదినాల్లో (కార్యాలయ వేళల్లో మాత్రమే) ఫిర్యాదులు స్వీకరిస్తారు. హైదరాబాద్ జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం మాత్రమే విద్యార్థుల తల్లిదండ్రులు అధికారులను సంప్రదించాలి.
 
ఫిర్యాదు చేయాల్సిన నెంబర్లు

 
అధికారి పేరు    హోదా    సెల్ నెంబరు
 ఆంజనేయులు    ఆడిటర్             9866123519
 కె.రాము           ఆడిటర్             9866836504
 పి.బాలరాజ్    సీనియర్ అసిస్టెంట్    9160232261
 యోగీందర్    జూనియర్ అసిస్టెంట్     7396631110

Advertisement
Advertisement