పాతబస్తీలో 144 సెక్షన్ | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో 144 సెక్షన్

Published Sat, Dec 5 2015 9:28 PM

పాతబస్తీలో 144 సెక్షన్ - Sakshi

చార్మినార్: పాతబస్తీలోని అన్ని ప్రాంతాలలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఆదివారం (6వ తేదీ) ఉదయం నుంచి 7వ తేదీ సోమవారం ఉదయం వరకు ఆంక్షలు కొనసాగుతాయని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఎప్పటిలాగే ప్రార్థనలు, పూజలు యథావిధిగా కొనసాగించుకోవచ్చన్నారు. బ్లాక్ డేను పురస్కరించుకొని పాతబస్తీలో 20 ప్లాట్లూన్ల పారా మిలటరీ దళాలు, 50 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, 150 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లతో పాటు దక్షిణ మండలంలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు చెందిన పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో స్థానికులు తమతో సహకరించాలని ఆయన కోరారు. ర్యాలీలు నిర్వహించడానికి ఇప్పటి వరకు ఏ మత సంస్థకూ అనుమతి ఇవ్వలేదన్నారు.

Advertisement
Advertisement