అధికారమే అ‘జెండా’! | Sakshi
Sakshi News home page

అధికారమే అ‘జెండా’!

Published Tue, Apr 28 2015 11:26 PM

అధికారమే అ‘జెండా’!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై సర్కారు దృష్టి
సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు సిద్ధం
అధికారుల ఉరుకులు..  పరుగులు
కాలనీ సంఘాలకు పనులు

 
సిటీబ్యూరో:  జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు దాదాపు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 15లోగా ఎన్నికలు నిర్వహించాలన్న న్యాయస్థానం ఆదేశాలు... టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కదలిక తెచ్చాయి. గ్రేటర్‌పై తమ జెండా ఎగురవేయాలన్న అజెండాతో అధికార పార్టీ ముందుకెళుతోంది. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా బస్తీలు... కాలనీల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఓ వైపు విస్తృతంగా సంక్షేమ కార్యక్రమాల అమలుకు.. మరోవైపు అభివృద్ధి పనులకు రంగం సిద్ధం చేసింది. వాటిపై దృష్టి సారించాల్సిందిగా నగరానికి చెందిన మంత్రులకు అధిష్ఠానం సూచించినట్లు తెలుస్తోంది. దీనిపై వారు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చిస్తున్నారు. అభివృద్ధి పనులను స్థానిక కాలనీ సంక్షేమ సంఘాలు, స్లమ్స్ డెవలప్‌మెంట్ సొసైటీలకే ఇవ్వాలని నిర్ణయించారు. వీటిని ఎలా అమలు చేయాలి.. ఎంతమొత్తంలోని పనులను స్థానిక సంఘాలకు ఇవ్వాలి.. ఎంత గడువివ్వాలి? బిల్లుల చెల్లింపు విధానం తదితరమైనవి వీలైనంత త్వరగా ఖరారు చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ మంగళవారం అధికారులకు సూచించారు.  

నివేదికల ఆధారంగా...

మరోవైపు అభివృద్ధి పనులు చేయడానికి ఆసక్తి కనబరిచే కాలనీ సంక్షేమ సంఘాల వివరాలు... వాటికి రిజిస్ట్రేషన్లు ఉన్నదీ..లేనిదీ... బ్యాంక్ అకౌంట్‌ల నెంబర్లు తదితరమైనవి సేకరిస్తారు. అర్హతలున్న సంఘాలకు పనులను మౌలిక సదుపాయాలపై దృష్టి..
 జనాభా ప్రాతిపదికన.. స్థానిక అవసరాల దృష్ట్యా పనులు వర్గీక రించాలని నిర్ణయించారు. ఇందులో భాగ ంగా అన్ని సర్కిళ్లలో 1000 లోపు జనాభా ఉన్న కాలనీ/బస్తీలను, 1000-2500 జనాభా ఉన్న ప్రాంతాలను... అంతకన్నా ఎక్కువ జనాభా ఉన్నవాటిని గుర్తిస్తారు. వీటిలో తక్కువ మౌలిక సదుపాయాలు ఉన్నవి.. ఫర్వాలేదనే స్థాయిలో ఉన్నవి... బాగున్నవి గుర్తిస్తారు. తక్కువ సదుపాయాలున్న వాటికి ప్రథమ ప్రాధాన్యమిస్తారు. ఇందులో భాగంగా సీసీరోడ్లు, బీటీరోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు.. ఇలా అంశాల వారీగా సమస్యలు గుర్తించి నివేదికలు రూపొందిస్తారు.

 ఇదీ ‘సంక్షేమ’ స్వరూపం

►స్వయం సహాయక బృందాలకు రూ.1000 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ అందజే సేందుకు చర్యలు ప్రారంభించారు. రోజువారీ నివేదిక లు అందజేయాల్సిందిగా ఆదేశించారు.

►పేదల బస్తీలు, ఇతర ప్రాంతాల్లో 1500 నీటి శుద్ధి కేంద్రాలు (ఆర్‌ఓప్లాంట్లు) ఏర్పాటు చేయాలనేది లక్ష్యం.
     
►{yైవర్ కమ్ ఓనర్ పథకాన్ని 5వేల మందికి వర్తింపజేయాలని భావిస్తున్నారు.
     
►మరో ఐదువేల మంది నిరుద్యోగులను గుర్తించి... వారికి స్వయం ఉపాధికి అవసరమైన శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో భాగంగా పోలీసు ఉద్యోగాల వంటి వాటికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.  
     
►వివిధ కాలనీలు, బస్తీల్లో 1000 ఈ-లైబ్రరీలు. వీటిలో దినపత్రికలు, మ్యాగజైన్లే కాక, రెండేసి కంప్యూటర్లు ఉంటాయి. ఆన్‌లైన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
     
►డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రతి నియోజకవర్గంలో రెండేసి స్లమ్‌ల (మొత్తం 48 స్లమ్స్‌లో) ఎంపిక.
    
►యువత కోసం వెయ్యి జిమ్‌ల ఏర్పాటు. వాటిని వారే నిర్వహించుకునేలా  అవకాశం.
     
►మరో వెయ్యి వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టుల నిర్మాణానికి చర్యలు.
     
►{పతి సర్కిల్‌లోనూ ఒక దోబీఘాట్‌ను సకల వసతులతో అభివృద్ధి చేస్తారు.
     
►177 శ్మశాన వాటికల్లో విస్తృతంగా మొక్కలు నాటి... హరిత వనాలుగా తీర్చిదిద్దనున్నారు.
     
►రూ. 5 భోజన కేంద్రాలు 50కి పెంపు.
     
►వీటిలో వీలైనన్ని కార్యక్రమాలను వంద రోజుల్లో చేయాలనే లక్ష్యంతో ఉన్నారు.
     
►మరోవైపు పారిశుద్ధ్య కార్యక్రమాల పర్యవేక్షణకు నగరాన్ని 330 క్లస్టర్లుగా విభజించి... వాటి బాధ్యతలను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి సివిల్‌సర్వీస్ అధికారులకు అప్పగించనున్నారు.
     
►ఇంకా.. వీలైనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ఓటర్లను ఆకట్టుకోవాలనేది సర్కారు లక్ష్యం.

Advertisement
 
Advertisement
 
Advertisement