టీఆర్‌ఎస్‌తోనే బతుకుల్లో మార్పు | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌తోనే బతుకుల్లో మార్పు

Published Wed, Jan 27 2016 12:33 AM

టీఆర్‌ఎస్‌తోనే బతుకుల్లో మార్పు - Sakshi

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  ఈటల రాజేందర్
 
రాయదుర్గం: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీని గెలిపిస్తే అందరి బతుకు లూ మారుతాయని రాష్ట్ర ఆర్థిక  శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నా రు. గ చ్చిబౌలి డివిజన్‌లోని రాయదుర్గంలో మంగళవారం టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినవీ... చెప్పని సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలి పారు. నగరంలో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి శ్రీకా రం చుట్టారన్నారు. మంచినీటి సరఫరాను మెరుగుపర్చేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారని తెలిపా రు.

గచ్చిబౌలి పరిసరాల్లో ఉన్న ఐటీ సంస్థల్లో స్థానికులకు ఉద్యో గ అవకాశాలు కల్పించేందు కు తెలంగాణ  ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తోందన్నారు. డ్వాక్రా మహిళలు ఆర్థికంగా ఉపాధి పొందేం దుకు తగి న రుణాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సామా న్య ప్రజలందరికీ అందాలంటే గ్రేటర్ ఎన్నికల్లో గచ్చిబౌలి డివిజన్ టీఆర్‌ఎస్ అభ్యర్ధి కొమిరశెట్టి సాయిబాబాను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్లమెంట్ సభ్యులు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్, సునీతాగోపాల్‌రెడ్డి, శేరిలింగంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మాదారం నర్సింగరావు, నాయకులు చెన్నం రాజ్, సాయిగౌడ్, సుధాకర్, వేణు, సతీష్, రాజు, భిక్షపతి, లక్ష్మయ్య ముదిరాజ్, స్వామిగౌడ్, రమేష్ గౌడ్, రాజేష్‌గౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement