కుతుబ్‌షాహీ టూంబ్స్‌కు మహర్దశ.. | Sakshi
Sakshi News home page

కుతుబ్‌షాహీ టూంబ్స్‌కు మహర్దశ..

Published Sat, Feb 28 2015 11:52 PM

Tumbs kutubsahi to the boom

వారసత్వ పరిరక్షణ నిధుల కేటాయింపు
రూ.100 కోట్లు వస్తాయని రాష్ట్రప్రభుత్వ అంచనా
{పపంచస్థాయి ప్రమాణాలతో అభివద్ధి పనులకు చేయూత
{పపచం వారసత్వ హోదా దక్కేందుకు   అవకాశాలు మెరుగు

 
హైదరాబాద్:  ఒక రాజవంశానికి చెందిన సమాధులు ఒకే చోట... ప్రపంచంలో ఎక్కడా లేని ఓ ప్రత్యేకత. ఈ ఘనతను సొంతం చేసుకుని ప్రపంచ వారసత్వ సంపద హోదా కోసం పోటీపడుతున్న  కుతుబ్‌షాహీ టూంబ్స్ ప్రాంగణానికి మహర్దశ పట్టబోతోంది. చారిత్రక వారసత్వ  సంపద పరరక్షణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం దీనికి నిధులు ఇవ్వబోతోంది.

దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన 25 చారిత్రక ప్రాంతాల్లో ఒకటిగా టూంబ్స్ ప్రాంగణాన్ని గుర్తించినట్టు బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. అయితే నిధులు ఎంత కేటాయించారో మాత్రం వెల్లడించలేదు. కానీ రూ.100 కోట్ల వరకు ఈ పద్దు కింద వస్తాయని రాష్ట్రప్రభుత్వం అంచనా వేస్తోంది. గతంలో ఎన్నోమార్లు రాష్ట్ర పురావస్తు శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఇంతకాలానికి మోదీ ప్రభుత్వం దానిపై దృష్టి సారించింది.
 
అనుకోని అవకాశం...

కొంతకాలంగా రాష్ట్రప్రభుత్వం కుతుబ్‌షాహీ టూంబ్స్‌కు ప్రపంచ వారసత్వ హోదా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గోల్కొండ, చార్మినార్ కట్టడాలతో కలిపి దీనికి సంబంధించిన డోజియర్‌ను  ‘యునెటైడ్‌నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్  అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో)’కు పంపింది. దీనికి సంబంధించి 2013లో యునెస్కో ప్రతినిధులు నగరానికి వచ్చి ఆ మూడు కట్టడాలను పరిశీలించారు. అయితే గోల్కొండ, చార్మినార్‌ల వద్ద భారీగా ఆక్రమణలు ఉండడంతో వాటిపై పెదవివిరిచినా... కుతుబ్‌షాహీ సమాధుల పట్ల ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. దీంతో యునెస్కో నిబంధనలకు తగ్గట్టుగా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించి చర్యలు ప్రారంభించింది. దాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి విడిగా యునెస్కో కు దరఖాస్తు చేయాలని భావిస్తోంది.
 
 ‘ఆగాఖాన్’ చేయూతతో ఇప్పటికే ఊపు...


 ‘ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్’ సంస్థ రెండేళ్ల క్రితం కుతుబ్‌షాహీ సమాధుల అభివృద్ధికి నడుం బిగించింది.  ఢిల్లీలోని హుమయూన్ సమాధి ప్రాంతాన్ని రూ.100 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన తరహాలోనే  కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంతాన్ని ఆ సంస్థ రూ.60 కోట్లు- రూ.90 కోట్ల ఖర్చుతో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈమేరకు 2013లో ఉమ్మడి రాష్ట్రప్రభుత్వంతో ఒప్పం దం కుదుర్చుకుంది.  దాదాపు ఐదేళ్ల పాటు సాగే ఈ ప్రా జెక్టులో కుతుబ్‌షాహీ ప్రాంగణంలోని 70 పురాతన కట్టడాలను తీర్చిదిద్దనుం ది.  పునరుద్ధరణ, పరిరక్షణ, నిర్వహణ... ఇలా ఈ ట్రస్టు కార్యాచరణ మూడు అంచెలుగా ఉండబోతుంది.
 
మొఘల్ గార్డెన్స్ తరహాలో పూదోటలు...  మ్యూజియం నిర్మాణం...


కేంద్రం ఇచ్చే నిధులతో ఆ ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నారు. ఖాళీ స్థలాలను తాజ్‌మహల్ ముందున్న మొఘల్ గార్డెన్ తరహా పూదోటలను ఏర్పాటు చేయనున్నారు. నగర చరిత్రను ప్రతిబింబించే అద్భుత మ్యూజియం నిర్మించనున్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే సిద్ధంగా ఉన్న ప్రణాళికను కేంద్రానికి పంపబోతున్నారు. ఆ పనులకు దాదాపు రూ.వంద కోట్ల వరకు అవసరమవుతాయని అంచనా వేస్తున్న పురావస్తు శాఖ... కేంద్రం నుంచి ఇప్పుడు అంతేమొత్తం వస్తాయని భావిస్తోంది. కేంద్ర పురావస్తు పర్యవేక్షణ పరిధిలోని కట్టడాలకు అందుతున్న నిధుల కంటే దీనికి ఎక్కువగా వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు.
 
గొప్ప అవకాశం

‘‘కేంద్ర ప్రకటన కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణానికి మంచి రోజులు తెచ్చినట్టే. దాన్ని ప్రపంచస్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు మేం సంకల్పించాం. ఆగాఖాన్ ట్రస్ట్ చేయూతతో ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. కేంద్రం నుంచి దాదాపు రూ.100 కోట్లు వచ్చే అవకాశం ఉన్నందున వాటితో దీన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ప్రపంచ వారసత్వ హోదా దక్కేందుకు యత్నిస్తాం’’
 బీపీ ఆచార్య, రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి

Advertisement

తప్పక చదవండి

Advertisement