డీసీఎం, ట్యాంకర్ ఢీ..ఇద్దరికి గాయాలు | Sakshi
Sakshi News home page

డీసీఎం, ట్యాంకర్ ఢీ..ఇద్దరికి గాయాలు

Published Sat, Jun 6 2015 9:49 AM

two injured of dcm van and tanker accident

హైదరాబాద్ సిటీ: హయత్‌నగర్ మండలం కోహెడ వద్ద ఔటర్ రింగురోడ్డుపై శనివారం ఉదయం 5 గంటలకు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఉన్న ట్యాంకర్‌ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో డీసీఎం డ్రైవర్, క్లీనర్‌కు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో డీసీఎం డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. స్థానికులు కష్టపడి డ్రైవర్‌ను బయటకు తీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement