మామూలు దొంగలు కాదు! | Sakshi
Sakshi News home page

మామూలు దొంగలు కాదు!

Published Thu, May 12 2016 2:22 AM

మామూలు దొంగలు కాదు! - Sakshi

ఇద్దరు అంతర్రాష్ట్ర చోరుల అరెస్టు
ఒకడు దోపిడీలు.. మరొకడు ఇళ్లల్లో దొంగతనాలు
►  సుమారు రూ. కోటి ‘సొత్తు’  రికవరీ

 
 
 సాక్షి, సిటీబ్యూరో
: ఇద్దరు కరుడుగట్టిన అంతర్రాష్ట్ర దొంగలను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకరు పగటిపూట ఇళ్లల్లో చోరీలు చేస్తుండగా.. మరొకడు దోపిడీ ముఠా సభ్యుడు. నిందితుల నుంచి  దాదాపు రూ. కోటి విలువ చేసే  బంగారు నగలు,  హోండా బ్రియో, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో బుధవారం క్రైమ్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి, క్రైమ్స్ ఏసీపీ రాములు నాయక్‌తో కలిసి సైబరాబాద్ క్రైమ్స్ ఓఎస్‌డీ నవీన్ కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం...
 మేకను బలిచ్చే ‘అమావాస్య’ దొంగ...


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాకు చెందిన మేకల వెంకటేశ్ అలియాస్ జాకీచాన్ ప్రస్తుతం బెంగళూరులోని ఓ హోటల్‌లో పని చేస్తున్నాడు. 15 ఏళ్ల ప్రాయంలోనే తండ్రి, ఇతర బంధువుల ప్రభావంతో చోరీల బాట పట్టిన ఇతగాడిపై ఇప్పటివరకు తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో దాదాపు 30కి పైగా దోపి డీ కేసులు నమోదయ్యాయి. 2007లో జడ్చర్ల జైలు ఎస్కార్ట్, 2012లో చర్లపల్లి గ్రామ సమీపంలో జైలు ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్న వెంకటేశ్ బెంగళూరు కు మకాం మార్చాడు. అక్కడ ఓ హోటల్‌లో పని చే స్తూ పూల నాగేశ్వరరావు, శ్రీను, పెవులు, రమేశ్, దు ర్గా, వాసు, మల్లికార్జున్‌లతో ముఠాగా ఏర్పడి మళ్లీ దోపిడీలు చేస్తున్నాడు. అమవాస్యకు ముందు రోజు రాత్రి ఈ ముఠా సభ్యులు కలిసి చోరీ చేయబోయే ప్రాంతంపై చర్చించుకునేవారు.

ఓ గొర్రెను బలిచ్చేవా రు. అమవాస్య రోజు రాత్రి ఆ ప్రాంతంలో  ఇళ్ల తలుపులను పగులగొట్టి పురుషులను తాళ్లతో కట్టేసి మహిళల నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదును దోచుకెళ్లేవారు.  నగరానికి వెంకటేశ్ వచ్చాడని తెలుసుకున్న ఎల్బీనగర్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని బృందం దాడి చేసి పట్టుకుంది. ఇతడి నుంచి రూ.15 లక్షల విలువైన 50 తులాల బంగారం, 300 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు.


 ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌నంటూ...
 ఎంబీఏ చదివిన ప్రకాశం జిల్లా వట్టెపాలెం వాసి వంశీకృష్ణ పగటిపూట ఇళ్లలో చోరీలు చేయడంలో సిద్ధహస్తుడు. 2006 నుంచి జంట పోలీసు కమిషనరేట్లలో 29 చోరీలు, విశాఖపట్నం పోలీసు కమిషనరేట్ పరిధిలో ఏడు ఇళ్లలో దొంగతనాలు చేసిన కేసుల్లో ఐదుసార్లు పోలీసుల చేతికి చిక్కాడు. 2012 చివర్లో జైలు నుంచి విడుదలైన వంశీ మకాం గుంటూరుకు మార్చాడు. నందనవనం కాలనీలో ఖరీదైన డూప్లెక్స్ భవనాన్ని అద్దెకు తీసుకున్న వంశీ అందరితో ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌నని చెప్పుకునేవాడు. గుంటూరు నుంచే విజయవాడ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లలో చోరీ చేయాలనుకుంటున్న ప్రాంతానికి కారులో వెళ్తాడు.

అక్కడ కారును పార్కింగ్ చేసి కొంత దూరం నడుచుకుంటూ వెళ్లి తాళం వేసిన ఇళ్లను గుర్తించి, కట్టింగ్ ప్లేయర్‌తో తాళం తెరుస్తాడు.  పడకగదిలోకి వెళ్లి అక్కడ దొరికిన తాళపుచెవులతో బీరువా తెరిచి బంగారు నగలు, నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులు చోరీ చేస్తాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని బృందం వంశీకృష్ణను అరెస్టు చేసింది. రెండు కిలోల 210 గ్రాముల బంగారం, 17,85,000ల విలువైన హోండా బ్రియో, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్, ల్యాప్ టాప్, కెమెరా, ట్యాబ్‌లను స్వాధీనం చేసుకుం ది.  వీటి విలువ మార్కెట్లో 84,85,000ల ఉంటుం దని పోలీసులు చెప్తున్నారు.
 

Advertisement
Advertisement