నోట్ల రద్దుపై మోదీ క్షమాపణ చెప్పాలి... | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుపై మోదీ క్షమాపణ చెప్పాలి...

Published Tue, Jan 17 2017 2:17 AM

నోట్ల రద్దుపై మోదీ క్షమాపణ చెప్పాలి... - Sakshi

  • ఉత్తమ్‌ డిమాండ్‌
  • నిజాయితీ పరులను రోడ్డుపాలు చేశారని ఆరోపణ
  • సాక్షి, హైదరాబాద్‌: పెద్దనోట్ల రద్దుద్వారా నిజాయితీపరులను రోడ్లపాలు చేసినందుకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో పీసీసీ తలపెట్టిన ఉద్యమకార్యాచరణపై కార్యక్ర మాల అమలు కమిటీ సోమవారం గాంధీ భవన్‌లో సమావేశమైంది. కమిటీ చైర్మన్‌ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌ మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దువల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మోదీ నిర్ణయంతో నల్లధనం ఉన్నవారికి, అవినీతి పరులకు మేలు జరిగిందని విమర్శించారు.

    నోట్ల రద్దుతో తలెత్తిన ఇబ్బందులపై కేంద్రాన్ని ఎండగట్టడానికి ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్తామన్నారు. దీనిపై కార్యా చరణ రూపొందిస్తున్నామని, మంగళవారం పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహి స్తామని, పార్టీ కార్యాచరణపై ఈ సందర్భంగా నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్‌ చెప్పారు. ఈ నెల 19న మహిళా విభాగం ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమా లుంటాయన్నారు. ఈ నెల 20న దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా హైదరాబాద్‌లోని ఆర్‌బీఐ ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల చివరివారంలో జన ఆవేదన సమ్మేళనం నిర్వహిస్తామని, దీనికి ఏఐసీసీ ప్రముఖులు హాజరవుతారని వెల్లడించారు.

    దొంగలకు సద్ది మోస్తున్న మోదీ...
    పెద్దనోట్ల రద్దు ద్వారా ప్రధాని మోదీ దొంగలకు సద్ది మోస్తున్నట్టుగా ఉందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శిం చారు. ప్రజలకు వ్యతిరేకంగా మోదీ పనిచేస్తు న్నారని ఆరోపించారు. విదేశాలనుంచి నల్లధనం తెస్తామని ఎన్నికలకు ముందు చెప్పి, ఇప్పుడు పెట్టుబడిదారులకు అండగా నిలబడుతున్నారని ధ్వజమెత్తారు. నగదు రహిత లావాదేవీల పేరుతో ప్రజలను ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శిం చారు. నోట్ల రద్దుద్వారా పేదల డబ్బులను బ్యాంకుల్లో వేయించిన ప్రధానమంత్రి మోదీ, వాటిని పెద్దలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు.

    ప్రజల కష్టార్జితాన్ని బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసుకోవడానికి పరిమితులు, నిబంధ నలను తొలగించాలని పొన్నాల డిమాండ్‌ చేశారు. బ్యాంకుల్లో ఉన్న ప్రజల డబ్బుకు 18 శాతం వడ్డీ చెల్లించాలని డిమాండ్‌ చేశారు. డిజిటల్‌ లావాదేవీలకు ఎలాంటి చార్జీలను వేయొద్దన్నారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళల బ్యాంకు ఖాతాలో 25వేల రూపాయలను జమ చేయాలని పొన్నాల డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు మల్లు రవి, దాసోజు శ్రవణ్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, నేరెళ్ల శారద, అనిల్‌కుమార్‌రావు, బల్మూరి వెంకట్, ఆరేపల్లి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement