'కేసీఆర్ పాలన నిజాం పాలనను మరిపిస్తోంది'

5 Oct, 2016 13:41 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ నేత వి.హనుమంతరావు (వీహెచ్) బుధవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాల విభజన శాస్త్రీయంగా కాకుండా వాస్తు ప్రకారం జరుగుతోందని విమర్శించారు. కేటీఆర్ కోసం గద్వాల్, జనగామ, సిరిసిల్ల జిల్లాలను ఓకే చేశారని వీహెచ్ చెప్పారు. కేసీఆర్ పాలన నిజాం పాలనను మరిపిస్తోందని వీహెచ్ ఎద్దేవా చేశారు.
 

మరిన్ని వార్తలు