వక్ఫ్ బోర్డు నోటిఫికేషన్ రద్దు | Sakshi
Sakshi News home page

వక్ఫ్ బోర్డు నోటిఫికేషన్ రద్దు

Published Tue, Oct 11 2016 1:10 AM

వక్ఫ్ బోర్డు నోటిఫికేషన్ రద్దు - Sakshi

సొలిత్రో కంపెనీ భూముల కేసులో హైకోర్టు తీర్పు
 సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా శివరాంపేట మండల పరిధిలోని సర్వే నంబర్లు 136,137, 227, 228లోని 23.08 ఎకరాల భూమి వక్ఫ్ బోర్డుకు చెందుతుందంటూ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. సొలిత్రో కంపెనీకి చెందిన ఆ భూ ములను వక్ఫ్ భూములుగా పేర్కొనడం చెల్లదని స్పష్టం చేసింది. ఎప్పుడో రద్దయిన వక్ఫ్ చట్టం ఆధారంగా ఈ నోటిఫికేషన్‌ను జారీ చేయడాన్ని తప్పు పట్టింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు తీర్పు వెలువరించారు.
 
  వక్ఫ్‌బోర్డు నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ సొలిత్రో కంపెనీ హైకోర్టులో పిటిషన్ వే సింది. యాక్సిస్ ఇంజనీర్స్‌కు చెందిన ఈ భూమిని తాము బ్యాంకు వేలంలో కొనుగోలు చేశామని కంపెనీ తరపు న్యాయవాది వివరించారు. 1954 వక్ఫ్ చట్టం కింద నోటిఫికేషన్ ఇచ్చారని, ఈ చట్టం ఎప్పుడో రద్దయిందని గుర్తు చేశారు. దాని స్థానంలో 1995 కొత్త వక్ఫ్ చట్టం అమల్లో కి వచ్చిందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు.
 

Advertisement
Advertisement