సమసమాజాన్ని స్థాపిద్దాం : రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ | Sakshi
Sakshi News home page

సమసమాజాన్ని స్థాపిద్దాం : రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్

Published Sun, Sep 29 2013 3:06 AM

సమసమాజాన్ని స్థాపిద్దాం : రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ - Sakshi

 హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రతి ఒక్కరూ సత్యం, ధర్మం, నీతి, నిజాయితీకి కట్టుబడి సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలని రాష్ర్ట హైకోర్టు న్యాయమూర్తి  జస్టిస్ బి.చంద్రకుమార్ సూచించారు. శనివారమిక్కడ ఎల్‌బీనగర్ సర్కిల్ ఆసరా కమిటీ ఆధ్వర్యంలో ‘సీనియర్ సిటిజన్ల రక్షణ-పోలీసుల పాత్ర’పై నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మానసికంగా, శారీరకంగా ఉత్తేజంగా ఉన్నవారు వయోధిక పౌరులు(సీనియర్ సిటిజన్లు) కాదని చెప్పారు.  గౌతమ బుద్ధుడు 86 ఏళ్ల వయసులో చనిపోవటానికి గంట ముందు వరకు బోధనలు చేశాడన్నారు. సీనియర్ సిటిజన్లు తమకున్న అనుభవంతో సమాజంలో పది మంది కష్టాలను తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేయాలని జస్టిస్ చంద్రకుమార్ కోరారు.
 
  ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా మార్పులను ఆమోదించాలన్నారు. పూట గడవని వృద్ధులను గుర్తించి సామాజిక బాధ్యతగా వారికి మేలు చేయాలని సీనియర్ సిటిజన్లను విశ్రాంత న్యాయమూర్తి ఎం.వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో వాలంటరీ కమిటీని ఏర్పాటు చేసుకుని పోలీసులకు సహకారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎల్‌బీనగర్ డిప్యూటీ కమిషనర్  సామ్రాట్ అశోక్, జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్ జయరాజ్ కెనడీ, ఎల్‌బీనగర్ డీసీపీ రవివర్మ, వనస్థలిపురం ఏసీపీ ఆనందభాస్కర్, జీహెచ్‌ఎంసీ ఆసరా ప్రాజెక్ట్ డెరైక్టర్ మమతాబాయి, ఆసరా సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఉప్పల గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement