రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తాం | Sakshi
Sakshi News home page

రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తాం

Published Thu, Jun 1 2017 3:31 AM

రాష్ట్ర భూసేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తాం - Sakshi

టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం
 
సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర భూసేకరణ చట్టానికి (2013) రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసి తీసుకువచ్చిన 2016 భూ సేకరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత  రైతులపై అధికారుల బెదిరింపులు పెరిగాయని ఆరోపించారు. రైతులు భూములు ఇవ్వకున్నా, బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేసి తామే బలవంతంగా తీసేసుకుంటామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఇక్కడ టీ అడ్వొకేట్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో భూ సేకరణ చట్టంపై చర్చావేదిక నిర్వహించారు. అనంతరం కోదండరాం విలేకరులతో మాట్లాడారు.

2016 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా పోరాటం సాగుతుందని, న్యాయపోరాటం కూడా చేస్తామని చెప్పారు. ఈ చట్టం ద్వారా చేస్తున్న భూ సేకరణ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద రైతులే ఎక్కువగా నష్టపోతున్నారని వివరించారు. కూకట్‌పల్లి భూ కుంభకోణాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. విలేకరుల సమావేశంలో న్యాయవాదులు అర్జున్, రవీందర్, శ్రవణ్, మల్లేశం, ధర్మార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

తప్పక చదవండి

Advertisement