నాడు మరిగిన రక్తం.. నేడు మురిగిపోయిందా? | Sakshi
Sakshi News home page

నాడు మరిగిన రక్తం.. నేడు మురిగిపోయిందా?

Published Thu, Sep 8 2016 2:53 PM

నాడు మరిగిన రక్తం.. నేడు మురిగిపోయిందా? - Sakshi

అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నామన్న వ్యాఖ్యలను చంద్రబాబు వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలన్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి తన మంత్రులను ఉపసంహరించుకోవాలని అన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని అమ్మేశారని, ఓటుకు కోట్ల కేసు నుంచి బయటపడేందుకు 5 కోట్ల మంది ప్రజల మనోభావాలను తాకట్టు పెట్టారని జగన్ మండిపడ్డారు.

తన మంత్రులను పక్కన కూర్చోబెట్టి జైట్లీతో ప్రకటన ఇప్పించారని, గతంలో జైట్లీ ప్రకటన చూసి రక్తం మరిగిందన్న చంద్రబాబుకు.. ఇప్పుడు రక్తం మురిగిపోయిందా అని ప్రశ్నించారు. ఒక పద్ధతి ప్రకారం ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చారని, చంద్రబాబు లాంటి సీఎం ఉండటం ఏపీ ప్రజలు చేసుకున్న ఖర్మ అని విమర్శించారు. చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని చెప్పారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును అమ్మేశారని, ప్రత్యేక హోదా సాధించేవరకు వైఎస్ఆర్‌సీపీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement