ఆర్‌బీఐ ప్రచురించే పత్రిక ఏది? | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ ప్రచురించే పత్రిక ఏది?

Published Tue, Jan 6 2015 11:46 PM

ఆర్‌బీఐ ప్రచురించే పత్రిక ఏది?

ఆర్థికాభివృద్ధికి దేశంలో అమల్లో ఉన్న ‘ద్రవ్య విధానం’ దిక్సూచీ లాంటిది. భారత్‌లో అత్యున్నత కేంద్ర బ్యాంక్ అయిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధానాన్ని రూపొందించడమే కాకుండా పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణం ఎలాంటి ఒడు దొడుకులు లేకుండా సాగడానికి పటిష్టమైన, ఆచరణీయమైన ద్రవ్య విధానాన్నిఆర్‌బీఐ రూపకల్పన చేస్తుంది. ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేరడానికి, ప్రజాసంక్షేమానికి దేశ ద్రవ్య విధానం దోహదపడుతుంది.

దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడకుండా నివారించడమే ఆర్‌బీఐ ద్రవ్య విధాన ప్రధాన ఉద్దేశం. ఆర్థికాభివృద్ధికి దేశంలో అమల్లో ఉన్న ‘ద్రవ్య విధానం’ దిక్సూచీ లాంటిది. భారత్‌లో అత్యున్నత కేంద్ర బ్యాంక్ అయిన భారతీయ రిజర్‌‌వ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య విధానాన్ని రూపొందించడమే కాకుండా పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణం ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాగడానికి పటిష్టమైన, ఆచరణీయమైన ద్రవ్య విధానాన్ని ఆర్‌బీఐ రూపకల్పన చేస్తుంది. ప్రభుత్వ ఉద్దేశాలు నెరవేరడానికి, ప్రజా
సంక్షేమానికి దేశ ద్రవ్య విధానం దోహదపడుతుంది. దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడకుండా నివారించడమే ఆర్‌బీఐ ద్రవ్య విధాన ప్రధాన ఉద్దేశం.
 
మాదిరి ప్రశ్నలు
 1.    {దవ్య విధానాన్ని రూపొందించి, నిర్వహించేది?
     1) కేంద్ర మంత్రి మండలి
     2) ఆర్‌బీఐ    3) ఆర్థిక సంఘం
     4) కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
 2.    ఆర్‌బీఐకి గవర్నర్‌గా పని చేసిన మొదటి భారతీయుడు?
     1) బిమల్ జలాన్    2) రంగరాజన్
     3) సి.డి. దేశ్‌ముఖ్ 4) ఎస్.ఎం. నరసింహం
 3.    రెపో రేటు అంటే?
     1) రీ పర్చేజ్ ఆపరేషన్ రేట్
     2) రీ పేమెంట్ ఆప్షన్ రేట్
     3) రివర్‌‌స పర్చేజింగ్ ఆర్డర్ రేట్
     4) రివర్‌‌స పేమెంట్ ఓరియంటేడ్ రేట్
 4.    ఆర్‌బీఐ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
     1) న్యూఢిల్లీ    2) కోల్‌కతా
     3) హైదరాబాద్    4) ముంబయి
 5.    ‘హాట్‌మనీ’ అంటే?
     1) అధిక పెట్టుబడులను ఆకర్షించే దేశాల్లోకి ద్రవ్య సరఫరా పెరగడం
     2)    బలహీన ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్య సరఫరాను తగ్గించడం
     3)    అధిక వడ్డీరేట్లు ఉన్న దేశాల్లోకి పెట్టుబడులు తరలిపోవడం
     4)    తక్కువ వడ్డీరేట్లు ఉన్న దేశాల నుంచి పెట్టుబడులు తరలిపోవడం
 6.    కంప్యూటరీకరించిన శాఖలు అధికంగా ఉన్న బ్యాంక్ ఏది?
     1) ఎస్‌బీఐ    2) ఎస్‌బీహెచ్
     3) పీఎన్‌బీ    4) సీబీఐ
 7.    ఆర్‌బీఐ ప్రచురించే పత్రిక ఏది?
     1) మనీ మ్యాగజైన్         2) న్యూస్‌లెటర్
     3) మానిటరీ పాలసీ
     4) బ్యాంకింగ్ బులెటిన్
 8.    ఎస్‌బీఐని ఏ సంవత్సరంలో స్థాపించారు?
     1) 1955    2) 1949    3) 1951    4) 1956
 9.    బ్యాంక్‌రేటు ఎక్కువగా ఉంటే పరపతి విధానంలో ఎలాంటి మార్పు వస్తుంది?
     1) పెరుగుతుంది    2) తగ్గుతుంది
     3) స్థిరంగా ఉంటుంది
     4) ఎలాంటి ప్రభావం ఉండదు
 10.    ఆర్‌బీఐ తీసుకునే పరిమాణాత్మక నియంత్రణ చర్యల్లో శక్తివంతమైంది?
     1) ఎస్‌ఎల్‌ఆర్ పెంచడం
     2) సీఆర్‌ఆర్ పెంచడం
     3) బ్యాంక్ రేటు పెంచడం
     4) బహిరంగ మార్కెట్ కార్యకలాపాలను విస్తృతం చేయడం
 
 సమాధానాలు
     1) 2;    2) 3;    3) 1;    4) 4;
     5) 3;    6) 1;    7) 2;    8) 1;
     9) 2;    10) 4.

Advertisement
Advertisement