యోగాతోనే ఆరోగ్యకర ఆయుష్షు | Sakshi
Sakshi News home page

యోగాతోనే ఆరోగ్యకర ఆయుష్షు

Published Fri, Jun 19 2015 2:39 AM

యోగాతోనే ఆరోగ్యకర ఆయుష్షు

ప్రపంచ యోగా, ఆరోగ్య కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: యోగాతోనే ఆరోగ్యకరమైన ఆయుష్షు ఉంటుందని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నాలుగురోజుల పాటు ఆర్ట్ ఎక్సోటికా కంపెనీ, ‘సాక్షి’ మీడియా సంయుుక్తంగా నిర్వహిస్తున్న  ప్రపంచ యోగా, ఆరోగ్య కన్వెన్షన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ఆయుర్వేద, యునాని, సిద్ధా, హోమియోపతి వైద్యసేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.

‘ఆయుష్’కు నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమానికి జ్యోతి వెలిగించి ప్రారంభించిన  కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ  మాట్లాడుతూ...ప్రధాని మోదీ పట్టుదలతో ఐక్యరాజ్యసమితి జూన్ 21ని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. ఆరోగ్యకర జీవితం కోసం అందరూ యోగా చేయాలని పిలుపునిచ్చారు. విద్యాసంస్థల్లో యోగా తరగతులు చేర్చాలన్న అంశానికి అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలన్న దత్తాత్రేయ.. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.
 
సద్వినియోగం చేసుకోవాలి...
‘నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్‌లో  ఉచిత యోగాక్లాసులు, ఆయుర్వేద, యునాని, సిద్ధా, హోమియోపతి ఉచిత వైద్య సేవలు, ప్రకృతి ఔషధాల మొక్కల పంపిణీ ఉంటుంది. ఆయా రంగాల్లో ప్రముఖులు చేసే ప్రసంగాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల’ని నిర్వాహకులు రామ్.జి.రెడ్డి, సంధ్యలు తెలిపారు. ప్రవేశం ఉచితం. ప్రతీరోజూ ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఉచిత యోగా క్లాస్‌లు ఉంటాయి.

ఉదయం పది నుంచి రాత్రి ఏడు గంటల వరకు స్టాళ్లు తెరిచి ఉండనున్నాయి. ఆయుర్వేద, యునాని, సిద్ధా, హోమియోపతి ప్రాధాన్యతను తెలిపే వివిధ కంపెనీల స్టాళ్లను ఏర్పాటుచేశారు. ప్రాచీన వైద్యం వల్ల జరిగే లాభాలను ఎగ్జిబిషన్‌కు వచ్చిన ప్రజలకు వివరిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన ఆర్గానిక్ ఫుడ్ రుచులు కూడా సందర్శకులకు నోరూరిస్తున్నాయి.  తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పేవిధంగా సాంసృ్కతిక కార్యక్రమాలు సాయంత్రం ఉండనున్నాయి.

 
Advertisement
 
Advertisement