అతడు విద్యార్థి కాదు..కూలీ | Sakshi
Sakshi News home page

అతడు విద్యార్థి కాదు..కూలీ

Published Wed, Mar 23 2016 10:29 AM

అతడు విద్యార్థి కాదు..కూలీ - Sakshi

ఉస్మానియా ఆర్ట్సు కళాశాల లైబ్రరీ వెనక ఉన్న నీటి ట్యాంకులో యువకుడి మృతదేహం బుధవారం కలకలం రేపింది.బుధవారం ఉదయం గమనించిన సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు.

 అయితే, అతడు నిరుద్యోగం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. గ్రూప్- 2 ఉద్యోగాల సంఖ్య పెంచాలనే డిమాండ్ తోనే చనిపోయాడంటూ ఆరోపించారు.  దీంతో అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. పోలీసులు మృతదేహాన్ని తరలించేందుకు యత్నించగా విద్యార్థులు అడ్డుకున్నారు. అతడి ఆత్మహత్యకు కారణాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ప్రాంత మంతా టెన్షన్ వాతావరణం నెల కొంది.

మరో వైపు యువకుడి మృత దేహం పూర్తిగా డీ కంపోస్టై ఉండటంతో.. గుర్తించడం కష్టంగా మారింది. ఓ స్థాయిలో యువకుడి మృత దేహాన్ని గుర్తుపట్టేందుకు వచ్చిన మాణిక్యేశ్వర్ నగర్ వాసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి పోలీసు విచారణలో అతడు విద్యార్థి కాదు..అడ్డా కూలీ అని, మాణిక్యేశ్వర్‌నగర్ వాసి అయిన ప్రసాద్ కుమారుడు బాబా అని తేలింది.


Advertisement

తప్పక చదవండి

Advertisement