మండలాల వారీగా ప్రణాళికతోనే అభివృద్ధి | Sakshi
Sakshi News home page

మండలాల వారీగా ప్రణాళికతోనే అభివృద్ధి

Published Tue, Nov 8 2016 1:42 AM

Zone-wise development plans

స్పష్టం చేసిన సీపీఎం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాభివద్ధికి అవస రమైన విధానాలతో పాటు, ఆయా ప్రణాళికల అమల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని సీపీఎం సూచించింది. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధా నాలతో రాష్ట్ర సమగ్రాభివద్ది సాధ్యం కాదని ఆరోపించింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తన విధానాలను మార్చుకోవాల్సిన అవస రం ఉందని సూచించింది. రాష్ట్రంలోని మండలాల వారీగా ప్రణాళికలను రూపొం దించి వాటిని సక్రమంగా అమలు చేయడం ద్వారానే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేసింది.

పార్టీపరంగా రూపొందిం చిన ‘ప్రత్యామ్నాయ అభివద్ధి-కార్యాచరణ ప్రణాళిక- చర్చాపత్రం’ను సోమవారం ఎంబీ భవన్‌లో పార్టీ నాయకులు చెరుపల్లి సీతారాములు, బి.వెంకట్, జి.నాగయ్య, జ్యోతి విడుదల చేశారు. పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న ‘మహాజనపాదయాత్ర’ నేప థ్యంలో విడుదల చేసిన ఈ చర్చాపత్రంపై వివిధ రంగాల నిపుణులు, మేధావులు, సామాజికవేత్తలు చర్చించి, మరిన్ని సూచన లు, సలహాలు తెలియజేస్తే వాటిని తుది కార్యాచరణ ప్రణాళికలో పొందుపరచ నున్నట్లు జి.నాగయ్య తెలిపారు.

Advertisement
Advertisement