10 కోట్ల ఏళ్ల నాటి వైరస్‌ | Sakshi
Sakshi News home page

10 కోట్ల ఏళ్ల నాటి వైరస్‌

Published Wed, Oct 11 2017 1:41 AM

10-million-year-old virus

గ్రీకు విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల ఓ గర్భిణి రక్తంలో దాదాపు 10 కోట్ల ఏళ్ల పురాతనమైన ఒక వైరస్‌ను గుర్తించారు. మానవ జన్యుక్రమంలో పురాతన వైరస్‌ తాలూకూ అవశేషాలు ఉండటం కొత్త కాకపోయినా భూమ్మీద రాక్షసబల్లులు తిరిగిన కాలం నాటివి గుర్తించడం ఇదే తొలిసారి.

హ్యూమన్‌ ఎండోజీనస్‌ రెట్రోవైరస్‌ (హెచ్‌ఈఆర్‌వీ) అనే ఈ వైరస్‌ మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రెట్రోవైరస్‌లు ఏం చేస్తున్నాయో తెలుసుకునేందుకు కాపోడిస్ట్రియన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు ప్రయత్నించారు. ఇటీవల ఓ గర్భిణి రక్తంలో గుర్తించిన హెచ్‌ఈఆర్‌వీ వైరస్‌ ఇప్పుడు ఓ జన్యువుగా మారిపోయింది. పిండాల్లో, కేన్సర్‌ వ్యాధిలో ఈ జన్యువు పనిచేస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతానికి ఇది మానవ పరిణామ దశలు చాలావాటిల్లో స్తబ్దుగా ఉన్నా మూలకణాలు, కేన్సర్, ఉమ్మ నీటి లక్షణాలను మార్చేసేంత శక్తిమంతమైనవి కావడం ఆందోళన కలిగిస్తోందని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న గికాస్‌ మాగిరోకినిసిస్‌ అంటున్నారు. ఈ వైరస్‌ను క్షుణ్నంగా అర్థం చేసుకోగలిగితే భవిష్యత్తులో కేన్సర్‌ వంటి వ్యాధులకు మెరుగైన చికిత్స లభించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Advertisement
Advertisement