కరోనా: 116 ఏళ్ల వృధ్దుడి కోరిక ఏంటంటే... | Sakshi
Sakshi News home page

116 ఏళ్ల వృద్ధుడికి దేశ అధ్యక్షుడిపై కోపం ఎందుకు

Published Sat, May 9 2020 4:54 PM

116 Years Old Man Expressed Sadness Having No Cigerratee on His Birthday  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌కు సంబంధించి భయంకరమైన విషయం ఏమిటంటే, సిగరెట్‌ అమ్మకాలపై నిషేధం విధించడం. ‘మే 8వ తేదీ సిగరెట్‌ లేకుండానే నా పుట్టిన రోజు గడచి పోవడం నాకు బాధాకరం’ ఈ మాటలు అన్నదెవరంటే 116 ఏళ్ల ప్రపంచ కురువద్ధుడైన ఫ్రెడీ బ్లామ్‌. ఆయన దక్షిణాఫ్రికాలోని అడలాయిడ్‌లో 1904, మే 8వ తేదీన జన్మించారు. ఆయనకు 14 ఏళ్లు ఉన్నప్పుడు, అంటే 1918లో ఆయన సోదరి స్పానిష్‌ ఫ్లూతో చనిపోయారట. ఆ వ్యాధి తనకు సోకకుండా బ్లామ్‌ ఆరు బయట గడ్డిలో పడుకునే వారట. అప్పట్లో స్పానిష్‌ ఫ్లూ వల్ల దక్షిణాఫ్రికాలో దాదాపు మూడు లక్షల మంది మరణించారు. (ఇవాంకా వ్యక్తిగత సహాయకురాలికి కరోనా!)



కరోనా వైరస్‌ మహమ్మారి ఎంతటి ప్రమాదకారో బ్లామ్‌ అర్థం చేసుకోలేక పోతున్నారని, ఆయన తన పుట్టిన రోజు సందర్భంగా సిగరెట్లు అందుబాటులో లేకపోవడం వెలితిగా భావించారని బ్లామ్‌ పొరిగింటాయన గైరోనెసా మైకేల్‌ తెలిపారు. ‘ఈ పుట్టిన రోజుకు సిగరెట్లు కావాలని కోరుకున్నాను. దేశాధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు’ అంటూ ఏకంగా దేశాధ్యక్షుడినే ఆయన తప్పు పట్టారు. గిన్నీస్‌ బుక్‌లోకి ఆయన మాత్రం ఎక్కలేదు. ఆయనకన్నా నాలుగేళ్లు చిన్న వాడైన బ్రిటన్‌ నివాసి, 112 ఏళ్ల బాబ్‌ వెయిటన్‌ ప్రపంచ వద్ధుడిగా గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు. (బాంబు పేలుడు : ఆర్మీ మేజర్ మృతి)



బ్లామ్‌ గురించి ఎవరూ గిన్నీస్‌ బుక్‌ దష్టికి తీసుకెళ్లక పోవడం వల్లనే ఆయన పేరు రికార్డుల్లో నమోదు కాలేదని ఆయన కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయన పుట్టిన రోజు గురించి మీడియా శుక్రవారం నాడు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు బ్లామ్‌ ఇంటి ముందు కూర్చొని ఉన్నారు. మధ్యాహ్నం ఆయన మనవళ్లు, ఇరుగుపొరుగు వారు వచ్చి ఆయనకు పుట్టిన రోజు అభినందనలు తెలుపుతూ పాట పాడారు. కేప్‌టౌన్‌లో వ్యవసాయం చేసుకుని బతికిన బ్లామ్‌ చివరి దశలో 106 ఏళ్ల వరకు గార్డెనర్‌గా పనిచేస్తూ కట్టెలు కూడా కొట్టేవారట. ఆయన భార్య కూడా ఇప్పటికీ ఉన్నారు. ‘నేను ప్రతి రోజు డిస్ప్రిన్‌ టాబ్లెట్‌ వేసుకుంటా. యూనో తాగుతాను. లాక్‌డౌన్‌ విధించే వరకు సిగరెట్లు కూడా తాగాను. అంతకుమించిన ఆరోగ్య రహస్యం మరేమి లేదు’ ఓ ప్రశ్నకు సమాధానంగా బ్లామ్‌ చెప్పారు. (పుతిన్కు కిమ్ జోంగ్ ఉన్ లేఖ)

Advertisement
Advertisement