ఇఫ్తార్‌ వికటించి 900 మందికి అస్వస్థత.. | Sakshi
Sakshi News home page

ఇఫ్తార్‌ వికటించి 900 మందికి అస్వస్థత..

Published Tue, Jun 13 2017 10:03 PM

ఇఫ్తార్‌ వికటించి 900 మందికి అస్వస్థత..

బాగ్ధాద్‌: ఇరాక్‌లో రంజాన్‌ మాసం సంధర్భంగా ఇచ్చిన ఇఫ్తార్‌ విందు వికటించి ఇద్దరు మృతి చెందగా వందల మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మోసుల్‌ నగరంలోని క్యాంపులో చోటుచేసుకుంది. ఫుడ్‌ పాయిజన్‌  ఈ ఘటనకు ప్రధాన కారణమని తెలుస్తోంది. రంజాన్‌ మాసం సందర్భంగా ఖతారీ హ్యూమనిరేషన్‌ అనే ఆర్గనైజేషన్‌ ఇప్తార్‌ విందును ఏర్పాటు చేసింది. ఈ విందులో పాల్గొన్న సుమారు 900 మంది తీవ్ర అస్వస్థతకులోనయ్యారు. వీరిలో చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉన్నారు.

ఆహారం తిన్న క్యాంపు జనం వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. ఇఫ్తార్‌ విందు వికటించడం వలన డిహైడ్రేషన్‌ గురయ్యారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు అందుతున్నాయి. ఇప్తార్‌ విందులో పెట్టిన చికెన్‌, బీన్స్‌ ఆహారాన్ని ఖతారీ చారిటీ ఇర్భిల్‌ నగరంలోని ఓ రెస్టారెంట్‌ నుంచి తీసుకొచ్చినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. ట్రస్టుకు సంబంధించిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఇర్భిల్‌ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య యుద్దం జరుగుతుంది.


Advertisement
Advertisement