38 మంది తాలిబన్ల హతం | Sakshi
Sakshi News home page

38 మంది తాలిబన్ల హతం

Published Wed, Dec 2 2015 6:00 PM

38 Taliban militants killed in Afghanistan

కాబుల్: అఫ్ఘానిస్తాన్ పోలీసులు, సైనిక దళాలు జరిపిన దాడుల్లో గత 24 గంటల్లో 38 తాలిబన్ ఉగ్రవాదులను హతమార్చారు. ఈ దాడుల్లో చాలా మంది ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం అఫ్ఘాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ మేరకు ప్రకటించింది.

నంగార్హర్, కుండుజ్, హెల్మండ్, సమంగన్, ఫర్యబ్, సారపుల్ ప్రావిన్స్ల్లో అఫ్ఘాన్ బలగాలు దాడులు చేశాయి. ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున్న ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ దాడుల్లో భద్రత బలగాలకు ఎవరికైనా హాని జరిగిందా అన్న విషయాన్ని అఫ్ఘాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. ఈ విషయంపై తాలిబన్ ఉగ్రవాదులు స్పందించలేదు.

Advertisement
Advertisement