లోపలి అవయవాలను చూపే త్రీడీ అద్దం.. | Sakshi
Sakshi News home page

లోపలి అవయవాలను చూపే త్రీడీ అద్దం..

Published Mon, Apr 21 2014 3:22 AM

లోపలి అవయవాలను చూపే త్రీడీ అద్దం..

మనిషి ఎదురుగా నిలబడితే శరీరంలోని ఎముకలు, కీళ్లు, ఇతర అవయవాలన్నింటిని చూపే  త్రీడీ అద్దాన్ని యూనివర్సిటీ ఆఫ్ పారిస్-సౌత్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. ముందుగా పీఈటీ స్కాన్, ఎక్స్-రే, ఎంఆర్‌ఐ స్కాన్‌లు చేయించుకుని తర్వాత ఈ అద్దం ముందుకు వెళితే అది ఎముకలను, అవయవాలను స్పష్టంగా చూపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ కెనైక్ట్ మోషన్-కాప్చర్ కెమెరాతో అనుసంధానమై ఉండే ఈ అద్దం.. మనిషి కదిలినప్పుడు ఎముకలు, కీళ్లు, అవయవాల కదలికలను కూడా చూపిస్తుందట. రోగుల శరీరంలో సమస్య క చ్చితంగా ఎక్కడుందో తెలుసుకునేందుకు, ఆపరేషన్లకు కచ్చితమైన చోటును గుర్తించేందుకు ఈ అద్దం ఉపయోగపడనుందట. మనిషి శరీరం అంతర్భాగాలను స్పష్టంగా చూపే ఇలాంటి మరో రెండు వినూత్న అద్దాలను ఇటీవల జర్మనీ, అమెరికా శాస్త్రవేత్తలు కూడా తయారు చేశారట.

Advertisement
Advertisement