కొత్త సంవత్సరం.. కొత్త మిస్టరీ... | Sakshi
Sakshi News home page

కొత్త సంవత్సరం.. కొత్త మిస్టరీ...

Published Sun, Jan 4 2015 10:13 AM

కొత్త సంవత్సరం.. కొత్త మిస్టరీ... - Sakshi

ప్రచండ భానుడి దక్షిణ ధృవంపై గురువారం (జనవరి 1న) భారీ నల్లమచ్చ ఏర్పడిందట. సూర్యుడి ఉపరితలం చుట్టూ కాంతివలయం(కరోనా)లో ఏర్పడిన ఈ నల్లమచ్చ ఐదేళ్ల వరకూ వివిధ ఆకారాల్లోకి మారుతూ కనిపించనుందట. అంతరిక్షంలోకి నాసా పంపిన ‘సోలార్  డైనమిక్స్ అబ్జర్వేటరీ’ గుర్తించిన ఈ మచ్చ శాస్త్రవేత్తలకు మరో మిస్టరీగా మారింది. సూర్యుడి కరోనాలో మచ్చలు ఏర్పడటం కొత్త కాకపోయినా.. అవి ఎలా ఏర్పడుతున్నాయన్నది ఇంకా అంతుపట్టడం లేదు.

ఈ మచ్చల వల్ల భూమి అయస్కాంత క్షేత్రంపై, అంతరిక్ష వాతావరణంపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్యుడి ఉపరితలం 6 వేల డిగ్రీ సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రతతోనే ఉంటే.. ప్లాస్మా కణాలతో నిండి ఉండే కరోనా మాత్రం ఏకంగా 10 లక్షల డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉంటుందట. సాధారణంగా సూర్యుడి నుంచి ప్లాస్మా కణాలతో కూడిన సౌరగాలులు సెకనుకు 400 కి.మీ. వేగంతో అంతరిక్షంలోకి విడుదలవుతాయి. కానీ ఇలాంటి మచ్చలు ఏర్పడినప్పుడు అవి సెకనుకు 800 కి.మీ. వేగంతో దూసుకొస్తాయట.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement