గ‘ఘన’ విన్యాసాలు..! | Sakshi
Sakshi News home page

గ‘ఘన’ విన్యాసాలు..!

Published Thu, Jul 31 2014 12:08 AM

గ‘ఘన’ విన్యాసాలు..!

గగనంలో విన్యాసాలు చేస్తున్న ఈ స్కైడైవర్ల పేర్లు ఫెడరిక్ ఫ్యూజెన్ (34), విన్సెంట్ రెఫెట్ (29). ఫ్రాన్స్‌కు చెందిన వీరికి భయం అంటే ఏమిటో తెలియదు. అందుకే ఏకంగా భూమికి 33 వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి ఔరా అనిపించారు. తొలుత వీరిద్దరూ ఓ విమానంలో యూరప్‌లోని అతిపెద్ద పర్వతమైన మౌంట్ బ్లాంక్‌కు పైభాగంలో 33వేల అడుగుల ఎత్తుకి వెళ్లారు. అంతే అక్కడ నుంచి కిందకు దూకేశారు. భూమి వైపు గంటకు 250 మైళ్ల వేగంతో వస్తూ రకరకాల విన్యాసాలు చేశారు.

అలా 40 సెకన్లపాటు అబ్బురపరిచే విన్యాసాలు చేసిన భూమికి 20వేల అడుగుల ఎత్తుకు వచ్చాక పారాచూట్లు ఓపెన్ చేసుకున్నారు. అనంతరం ఏడు నిమిషాలకు ఇటలీలోని కైర్‌మేయూర్‌లో సురక్షితంగా కిందకు దిగారు. ఈ సాహసకృత్యం చేయడానికి వీరిద్దరూ చాలా శ్రమిం చారు. ఆస్ట్రియా, స్పెయిన్‌ల లో దాదాపు ఏడాదిన్నరపాటు కఠోర శిక్షణ తర్వాతే ఈ సాహసానికి పూనుకుని విజయం సాధించారు.
 

Advertisement
Advertisement